త‌మ‌న్నా పాప పోలీసా..?!

త‌మ‌న్నా ఇప్పుడు ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసింది. ఆగ‌డు, బాహుబ‌లి సినిమాలు చేరో చేతిలో ఉంచుకొని… 2014 సంవత్సరాన్ని ప్రారంభించ‌నుంది. అంతేకాదు.. బాల సినిమాలో కూడా న‌టిస్తోంద‌నే వార్తలొస్తున్నాయి.  Advertisement ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే..…

త‌మ‌న్నా ఇప్పుడు ఫుల్ ఫామ్‌లోకి వ‌చ్చేసింది. ఆగ‌డు, బాహుబ‌లి సినిమాలు చేరో చేతిలో ఉంచుకొని… 2014 సంవత్సరాన్ని ప్రారంభించ‌నుంది. అంతేకాదు.. బాల సినిమాలో కూడా న‌టిస్తోంద‌నే వార్తలొస్తున్నాయి. 

ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. ఆగ‌డులో ఈ అందాల భామ పోలీస్ దుస్తుల్లో క‌నిపిస్తుంద‌ట‌. ఈ నాజూకు న‌డుమందాల త‌మ‌న్నా… పోలీస్‌గా త‌ళుక్కుమ‌ని మెరుస్తుంద‌ట‌. ఆగ‌డు కూడా దూకుడులానే పోలీస్ స్టోరీనే. 

అయితే ఈ సినిమా త‌మ‌న్నా కూడా ఓ సంద‌ర్భంలో యూనిఫామ్ వేసుకొంటుంద‌ట‌. అంటే… త‌మ‌న్నా ఈ సినిమాలో పోలీసా.?  లేదంటే ఏదో స‌ర‌దాగా ఓ స‌న్నివేశంలో క‌నిపిస్తుందా..? అనేది తేల‌డం లేదు. ఓ అగ్రక‌థానాయిక పోలీస్ యూనిపామ్‌లో క‌నిపించి చాలా రోజులైంది. ఆ ముచ్చట ఈ మిల్క్ బ్యూటీ తీరుస్తుందేమో…?