Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తమన్నా బ్యాడ్ లక్

తమన్నా బ్యాడ్ లక్

ఓ సినిమా భారీగా హిట్ అయితే హీరో, దర్శకుల్లో ఎవరో ఒకరికి క్రెడిట్ దక్కినా మిగిలన వారు కూడా ఇంతో అంతో హ్యాపీగా వుంటారు. కానీ బాహుబలి విషయంలో తమన్నాకు పూర్తిగా మైనస్ మార్కులు పడిపోయాయి. ప్రభాస్, రానా లాంటి బాహుబలుల మధ్య పిట్టలా వుందన్న కామెంట్ లు వినిపించాయి. 

పిట్ట పర్సనాలిటీతో వున్న తమన్నా, మగాడిలో మిలటరీ కవాతు చేసే ప్రయత్నం చేస్తే జనాలు, సినిమాకు అదే కామెడీ అంటున్నారు. నిజానికి తమన్నా తెలుగునాట కొట్టిన హిట్ లు లెక్క పెట్టడానికి ఒక చేతి వేళ్లు కూడా ఎక్కువే. 

అందునా భారీ సినిమాల్లో నటిస్తే అవి డిజాస్టర్లే. అలాంటిది బాహుబలి లాంటి మెగా ప్రొడక్షన్, మెగా కలెక్షన్ సినిమా వచ్చిందనుకుంటే, ఈ విమర్శల వల్ల ఆ ఆనందం కూడా మిగలడం లేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?