అందరి హీరోల జీవితాలు కోట్ల మీద నడవ్వు. కొందరి జీవితాలు కోట్ల అప్పుల మీద కూడా నడుస్తాయి. ఓ తమిళ హీరో దాదాపు వంద కోట్ల అప్పుల్లో వున్నట్లు బోగట్టా.
అక్కడేమో సినిమాలు తీసే నిర్మాతలు రాను రాను తగ్గిపోతున్నారు. దాంతో తమిళ హీరోలంతా తెలుగు నిర్మాతల వైపు చూస్తున్నారు.
ఈ మధ్య ఫలానా హీరోడేట్లు వున్నాయి కావాలా? అంటూ తమిళ హీరోల మేనేజర్లు తెలుగు నిర్మాతలను ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని బోగట్టా. అలాగే ఓ హీరో డేట్లు తెలుగునిర్మాత తీసుకున్నారు. సదరు హీరోకు అక్కడ దాదాపు వంద కోట్లు అప్పు వుందట. ఈ సినిమా పుణ్యమా అని ఓ పదిహేను..ఇరవైకోట్లు చెల్లుబాటు చేసుకోవచ్చు. లేదా వడ్డీలయినా కట్టుకోవచ్చు.
అయినా మన తెలుగు నిర్మాతలు కొందరు మరీ బిజినెస్ మోజులో పడి ముందు వెనుక చూసుకోవడం లేదు.