తొలిసారి మహేష్ బాబు దెబ్బ తిన్నాడు. మహేష్ కు ఫ్లాప్ లు లేకపోలేదు. కానీ బ్యాడ్ నేమ్ అన్నది లేదు. సినిమాలు ఏవరేజ్ అయినా, ఫ్లాప్ అయినా, బానే వున్నాయే కానీ ఎందుకు అలా అయ్యాయో అనే అనేవారు. మురారి, అతడు, ఖలేజా ఇప్పటికీ టీవీ రేటింగ్ ల్లో టాప్. వన్ డిజాస్టర్ అయినా మహేష్ కు ప్రశంసలే లభించాయి. కానీ తొలిసారి ఆగడు సినిమా మహేష్ ప్రతిష్టను నిలువునా నీరు కార్చింది.
ఇందుకు ముమ్మాటికీ శ్రీను వైట్లే కారణమని ఫ్యాన్స్ నిప్పులు కక్కుతున్నారు. మహేష్ పాపులర్ పంచ్ డైలాగ్ పట్టుకుని, ఓ చోటా విలన్ చేత మళ్లీ అతగాడి సినిమాలోనే సెటైర్ వేయించడం, కావాలని ఆర్జీవీని కెలికి అతగాడి చేత మహేష్ ను టార్గెట్ చేయించడం సరికాదంటున్నారు. ప్రకాష్ రాజ్ ఏదో తన బాధతో తను కవిత్వం చెబితే, దాన్ని మళ్లీ మహేష్ సినిమాలో సెటైర్ గా మార్చడం. ఇలా ఇండస్ట్రీలో ఎవరినీ వదలడం లేదు శ్రీను వైట్ల.
గతంలో కూడా సినిమా పర్సనాలిటీలపై తన సినిమాల్లో సెటైర్లు వేయించాడు. తరచు బ్రహ్మానందం చేత పాపులర్ హీరొల పాటలకు ఢ్యాన్స్ లు చేయించి వారిని టార్గెట్ చేసాడు. ఇలా అన్ని విధాల తాను టార్గెట్ అయ్యాడు. ఇప్పుడు ఇంతకు ఇంతా మహేష్ ను చుట్టుకుంటోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమాను ఎంత బ్యాడ్ చేయాలో అంతా చేసారు. దీనంతటికీ కారణం శ్రీను వైట్ల అని టాక్ పెరిగిపోయింది.
ఇక కోన వెంకట్ గ్రూప్ అయితే ఏమీ పైకి అనకున్నా సంబరమే చేసుకుంటోందని తెలుస్తోంది. టీవీ చానెళ్లన్నీ కోన వెంకట్ లేకనే ఈ వైఫల్యం అన్న కథనాలు వరుస పెట్టి ప్రసారం చేస్తున్నాయి. అందరివాడు, నమో వెంకటేశ ఇలా శ్రీను వైట్ల ఫ్లాపుల జాబితా చిన్నదేమీ కాదు. కానీ దూకుడు ముందు ఇవన్నీ జనం మరిచిపోయారు. ఇప్పుడు ఆగడుతో మళ్లీ విజయాలు మరుగున పడి ఫ్లాపుల లెక్కలు తీస్తున్నారు. దీంతో శ్రీను వైట్ల పది కోట్లకు పైగా పారితొషికం నుంచి నాలుగైదు కోట్లకు పడిపోయినట్లే.