పెళ్లిచూపులు సినిమాతో పెద్ద హిట్ కొట్టాడు డైరక్టర్ తరుణ్ భాస్కర్. ఆ తరువాత ఏంటీ అన్నది క్వశ్చను. నిజానికి రాజ్ కందుకూరికి ఓ సినిమా చేయాల్సి వుంది. అలాగే సురేష్ బ్యానర్ లో ఒకటి. నిఖిల్ హీరోగా ఓ సినిమా చేయడానికి ప్రయత్నించినట్లు వార్తలు వచ్చాయి. ఆఖరికి సురేష్ కాంపౌడ్ లోనే సినిమా వుంటుందని వార్తలు వినవచ్చాయి.
గతంలో వెళ్లిపోమాకే అనే చిన్న సినిమా చేసిన విష్వక్ సేన్ అనే హీరోతో సినిమా చేయబోతున్నట్లు వార్తలు అందుతున్నాయి. హీరోగా విష్వక్ సేన్ ను తీసుకోవడం బట్టే పెళ్లిచూపులు రేంజ్ లోనే మరో చిన్న సినిమాను సురేష్ బాబు-తరుణ్ భాస్కర్ చేయబోతున్నట్లు అర్థం అవుతోంది.
గతంలో తరుణ్ భాస్కర్ సైన్మా అనే షార్ట్ ఫిలిం చేసారు. యూ ట్యూబ్ లో అది బాగా పాపులర్ అయింది. ఆ షార్ట్ ఫిలింను ఫీచర్ ఫిల్మ్ గా మార్చాలన్న అయిడియా తరుణ్ భాస్కర్ కు వుంది. మరి ఆ కథనే ఇప్పుడు సురేష్ బ్యానర్ పైకి తెస్తున్నారా? మరో కథనా? అన్నది తెలియాల్సి వుంది.