టాక్సీవాలా గ్రాఫిక్స్ మళ్లీ మరోసారి

విజయ్ దేవరకొండ-యువి క్రియేషన్స్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా టాక్సీవాలా. నిజానికి ఇది కాస్త మీడియం సినిమానే అయినా, గ్రాఫిక్స్ పార్ట్ కొంచెం ఎక్కువే వుంది. ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి…

విజయ్ దేవరకొండ-యువి క్రియేషన్స్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న సినిమా టాక్సీవాలా. నిజానికి ఇది కాస్త మీడియం సినిమానే అయినా, గ్రాఫిక్స్ పార్ట్ కొంచెం ఎక్కువే వుంది. ఈ సినిమా మే నెలలోనే విడుదల కావాల్సి వుంది. కానీ వాయిదా పడింది. ఈ నెలలో విడుదలవుతుందని అంటున్నారు. కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ చాన్సెస్ అని వినిపిస్తోంది.

ఎందుకుంటే సినిమా క్వాలిటీ విషయంలో కాస్త మళ్లీ మళ్లీ చూసుకోవడం అన్నది ఒక పక్క జరుగుతోంది. ఎడిటింగ్ అయిపోయి, ఫస్ట్ రా కాఫీ రెడీ అయిపోయిన తరువాత కూడా కాస్త ముందు వెనుక చూసుకుంటున్నారు. కానీ సమస్య మరో వైపు నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా గ్రాఫిక్స్ వర్క్ ను ఓ కొత్త కంపెనీకి అప్పగించారు. అది ఎవరిదో కాదు, నిర్మాత అల్లు అరవింద్ పెద్ద కొడుకు (బన్నీ అన్నయ్య) పార్టనర్ గా వున్న సంస్థ. కానీ ఆ సంస్థ అందించిన గ్రాఫిక్స్ క్వాలిటీగా రాలేదని తెలుస్తోంది. దాంతో అదే సంస్థ మళ్లీ మరోసారి గ్రాఫిక్స్ తయారు చేయడానికి రెడీ అయింది. ఈసారి మరింత క్వాలిటీ ఫీపుల్ ను హైర్ చేసి గ్రాఫిక్స్ చేయించే పనిలో పడింది.

క్వాలిటీ కోసం ఆలస్యం కాబట్టి ఫరవాలేదు. అర కొర క్వాలిటీతో బయటకు వచ్చి, బాగా లేదని అనిపించుకోవడం కన్నా, కాస్త ముందు వెనుక చూసి ఆలస్యంగా వచ్చినా ఫరవాలేదు. గ్రాఫిక్స్ అప్ టు ది మార్క్ రెడీ అయిపోతే జూన్ లో లేదూ అంటే ఆగస్టులో వస్తాడేమో 'టాక్సీవాలా'.