‘ఎన్టీఆర్’లో ఇప్పుడు ఆ యాంగిల్ కూడా ఉండదేమో!

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన మహాచరిత బయోపిక్ లో ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, స్వయానా బాలయ్య నటిస్తున్న ఈ బయోపిక్ లో వెన్నుపోటు ఎపిసోడ్ ఉంటుందని ఊహిస్తే అంతకంటే…

ఎన్టీఆర్ ను చంద్రబాబు వెన్నుపోటు పొడిచిన మహాచరిత బయోపిక్ లో ఉండదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే, స్వయానా బాలయ్య నటిస్తున్న ఈ బయోపిక్ లో వెన్నుపోటు ఎపిసోడ్ ఉంటుందని ఊహిస్తే అంతకంటే మూర్ఖత్వం ఉండదు. ఇప్పుడీ బయోపిక్ లో మరో మార్పు కూడా చోటుచేసుకోనుంది.

ఏపీలో మారిపోతున్న రాజకీయ పరిణామాలకు తగ్గట్టే, బయోపిక్ లో మార్పుచేర్పులు తప్పడంలేదు. స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ కాంగ్రెస్ తో సరికొత్త అక్రమ సంబంధానికి తెరదీశారు చంద్రబాబు. మొన్నటివరకు బీజేపీతో కులికిన టీడీపీ, ఇకపై “హస్తం”తో రాసుకుపూసుకుంటుందన్నమాట. సరిగ్గా ఇక్కడే బయోపిక్ కు చిక్కులొచ్చిపడ్డాయి.

టీడీపీ పుట్టుకలోనే కాంగ్రెస్ వ్యతిరేకత ఉంది. టీడీపీ ఆవిర్భావానికి ప్రధాన కారణమే అది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ వ్యతిరేక భావజాలాన్ని బాగానే ఏపీ ప్రజలకు నూరిపోశారు. దుష్టకాంగీ అనే పదప్రయోగం ఎన్టీఆర్ దే. తర్వాత ఆ పదం తెలుగు మీడియాలో కూడా వచ్చేసింది. బయోపిక్ లో ఇలాంటి పదాలు, కాంగ్రెస్ వాళ్లను తిట్టిన సన్నివేశాలు బాగానే ఉన్నాయి.

ఇప్పుడు చంద్రబాబు నేరుగా వెళ్లి అదే హస్తానికి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో.. బయోపిక్ లో కాంగ్రెస్ ఎపిసోడ్ పై అనుమానాలు పొడసూపుతున్నాయి. చరిత్రలో జరిగిన నాదెండ్ల ఎపిసోడ్ తో పాటు కాంగ్రెస్ వ్యతిరేక సన్నివేశాల్ని ఉంచాలా తీసేయాలా అనే చర్చ ఇప్పుడు యూనిట్ లో మొదలైంది.

దుష్ట కాంగీ లాంటి పదాలు, 'హస్త' వ్యతిరేక సన్నివేశాలు బయోపిక్ లో ఉంటే అది ఏపీలో కాంగ్రెస్-టీడీపీ అక్రమ సంబంధాన్ని సజావుగా సాగనివ్వదు. అలా అని ఆ ఎపిసోడ్ తీసేస్తే టోటల్ బయోపిక్ కే అర్థం లేకుండాపోతుంది. అందుకే మధ్యేమార్గంలో వ్యతిరేకతను కాస్త తగ్గించి, కాంగ్రెస్ ను సాఫ్ట్-విలనీ పంథాలో చూపించే ప్రయత్నాలు సాగుతున్నాయి.

చిలక.. 'ఛీ'బీఐ.. భళా మోడీ భళా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ లో