కొత్త కాంబినేషన్ కాదు. నాని హీరోగా విక్రమ్ కుమార్ సినిమా దాదాపు కొన్నినెలల కిందట వార్తల్లో నానింది. కానీ నానికి ఆ సినిమా ఎందుకో అప్పట్లో చేయాలని అనిపించలేదు. విక్రమ్ కుమార్ తో సమస్యకాదు, మరేదో వుందని గుసగుసలు వినిపించాయి. విక్రమ్ కుమార్ అప్పుడు బన్నీ వైపు వెళ్లాడు. బన్నీతో సినిమా అని వార్తలు వినిపించడం ప్రారంభమైంది.
కథ సెట్ కాలేదు. ఫస్ట్ హాఫ్ లాక్ అయింది. సెకండ్ హాఫ్ మార్చాలి. వక్కంతం వంశీతో కలిపి విక్రమ్ కుమార్ అదే పని మీద వున్నాడు. ఇలా వార్తలు వచ్చాయి. ఇంతలో అరవింద సమేత కాస్త ఊపిరి ఊదడంతో, దర్శకుడు త్రివిక్రమ్ సీన్ లోకి ఎంటర్ అయ్యారు. దీంతో విక్రమ్ పక్కకు వెళ్లి త్రివిక్రమ్ వచ్చినట్లు అయింది.
దాంతో ఇప్పుడు మళ్లీ పాత కాంబినేషన్ తెరమీదకు వచ్చింది. హీరో నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమా తరువాత మరే సినిమా అన్నది ఇప్పటిదాకా కమిట్ కాలేదు. ఇప్పుడు కమిట్ అయ్యాడని వార్తలు వినవస్తున్నాయి.
విక్రమ్ కుమార్ తో నాని సినిమా ఫిక్స్ అయింది. అయితే నిర్మాత ఎవరు అన్నది ఇంకా తెలియదు. ఎందుకంటే విక్రమ్ కుమార్ దగ్గర రెండు మూడు అడ్వాన్స్ లు వున్నాయి. వాటిల్లో అశ్వనీదత్ ది వుంది, మహేష్ సోదరి మంజుల దీ వుంది.
నానికి అశ్వనీదత్ బ్యానర్ తో మంచి అనుబంధం వుంది కాబట్టి, ఆ బ్యానర్ కే చేసే అవకాశం వుందని తెలుస్తోంది.