అదిగో పులి అంటే ఇదిగో తోక అనే వైనం ఇలాగే వుంటుంది. ఎవరో అన్నారు..మనం కూడా అదే దోవలో పోదాం అనే టైపు. నిన్నటికి నిన్న ఓ గ్యాసిప్ బయటకు వచ్చింది. వివి వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మిస్తున్న శీనయ్య సినిమా కోసం ఇప్పటి దాకా తీసిన ఫుటేజ్ బాగా రాలేదని, చూసిన దిల్ రాజు అసంతృప్తితో, సినిమాను పక్కన పెట్టి, డైరక్టర్ ను మళ్లీ తీయమన్నారన్నది ఆ గ్యాసిప్.
అసలు విషయం ఏమిటంటే, శీనయ్య సినిమా జనవరి 6 నుంచి షూటింగ్ ప్రారంభించాల్సి వుంది. సినిమాలో జాతర సీన్లు కావాల్సి వుండడంతో, కొన్నాళ్ల క్రితం గుంటూరు జిల్లాలో జరిగిన జాతర్ల ఫుటేజ్ కావాలని, ఓ కెమేరా మన్ ను, అసిస్టెంట్ డైరక్టర్ ను పంపి, చిత్రీకరించి తెప్పించారు.
మరో పక్క స్క్రిప్ ఫైనల్ కాపీ తయారుకావాల్సి వుంది. ఇలాంటి టైమ్ లో ఈ గ్యాసిప్ వచ్చింది. ఏ ఫుటేజ్ తీసామా, ఏది పక్కన పెట్టామో అన్నది తెలుసుకోవాలని ఇప్పుడు నిర్మాత దిల్ రాజు వెదుకుతున్నారని ఆ సినిమా యూనిట్ జనాలు జోకులు పేల్చుతున్నారు. నరసింహా రావు డైరక్షన్ లో తయారయ్యే ఈ సినిమాకు డైలాగ్ వెర్షన్ నే ఇంకా పూర్తిగా చేయలేదు..షూటింగ్…ఫుటేజ్..రీ షూట్ ఏమిటా? అని కామెంట్లు వినిపిస్తున్నాయి.