డైరక్టర్ తేజ వ్యవహారం అంతా డిఫరెంట్ గా వుంటుంది. ఆయనదో స్టయిల్ అని సరిపెట్టుకోవాల్సిందే. నిన్నటికి నిన్న జరిగిన సీత ప్రీరిలీజ్ ఈవెంట్ లో తేజ స్పీచ్ వింటే, ఇదే అనిపిస్తుంది. ఆ స్పీచ్ లో కొన్ని పాయింట్లు
*సినిమా మొత్తం అయ్యాక పరుచూరి బ్రదర్స్ ను పిలిచి చూపించాను. తేడాలు వుంటే నాకు తెలియదు. మీరే చెప్పండన్నాను. వాళ్లు ఏవేవో బోలెడు చెప్పారు. అవన్నీ మళ్లీ రీషూట్ చేసి సెట్ చేసాం.
*ఇప్పటికీ నాకు జడ్జిమెంట్ తెలియదు. తీస్తానంతే. బాగా వచ్చిందో లేదో మీరే చెప్పాలి. బాగాలేదు అంటే మరోసినిమా తీస్తా.
* సినిమాలో అంతా బాగా చేసారు. కానీ నేనే బాగా చేయలదని అనుకుంటున్నాను. సినిమా చూస్తే కానీ తెలియదు.
*బెల్లంకొండ శ్రీనివాస్ ను మీరు ఎప్పుడూ చూసే కమర్షియల్ విధానంలో చూపించలేదు. నేను కొత్తగా చూపించాను.
*బెంగళూరు వెళ్తే సినిమా బాగుంటుందా? బాగుండదా అని అడిగారు. నాకు తెలిస్తే కదా చెప్పడానికి. అందుకే ఏమీ చెప్పలేదు.
ఇలా సినిమా మీద రకరకాలుగా డవుట్ వచ్చేలా మాట్లాడుకుంటూ వెళ్లారు తేజ. మరి ఇదంతా నిజాయతీగా మాట్లాడడడం ఆయన అలవాటు అని సరిపెట్టుకోవాలా? సినిమా మీద ఆయనకే నమ్మకం లేదు అనుకోవాలా? లేక సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రమోట్ చేయడం ఇదికాదని అనుకోవాలా?