మహేష్ మళ్లీ దేవీతోనే..?

మహర్షి సినిమాకు పనిచేసిన వారందరికీ అప్లాజ్ వచ్చింది. ఒక్క దేవీశ్రీప్రసాద్ కు తప్ప. టీమ్ జనాల్లో కూడా హీరో మహేష్ తప్ప మరెవరు దేవీశ్రీప్రసాద్ ను వెనకేసుకురాలేదు. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో దేవీశ్రీప్రసాద్…

మహర్షి సినిమాకు పనిచేసిన వారందరికీ అప్లాజ్ వచ్చింది. ఒక్క దేవీశ్రీప్రసాద్ కు తప్ప. టీమ్ జనాల్లో కూడా హీరో మహేష్ తప్ప మరెవరు దేవీశ్రీప్రసాద్ ను వెనకేసుకురాలేదు. ఫ్యాన్స్ అయితే సోషల్ మీడియాలో దేవీశ్రీప్రసాద్ ను దుమ్మెత్తిపోసారు.

చిత్రంగా ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ లో దేవీశ్రీ ప్రసాద్ చాలా యాక్టివ్ గా, చాలా ఎక్కువగా పాల్గొన్నాడు. హీరో, డైరక్టర్లతో సమానంగా ప్రమోషన్ల కోసం వర్క్ చేసాడు. అంటే సినిమాలో తన వర్క్ పై వచ్చిన రిమార్క్ ను దేవీశ్రీప్రసాద్ కూడా గమనించాడన్నమాట. దానిని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కిందామీదా పడ్డాడు అనుకోవాలి.

ఏమైయితేనేం, మహేష్ బాబు తరువాత సినిమాకు కూడా దేవీశ్రీప్రసాద్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అడ్వాన్స్ కూడా అందుకున్నట్లు బోగట్టా. అనిల్ రావిపూడి డైరక్షన్ లో మహేష్ చేయబోయే సినిమాను అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ మారుతాడేమో అని, థమన్ జాయిన్ అవుతాడేమో అన్న గుసగుసలు వినిపించాయి. కానీ మహేష్ బాబు మల్లీ దేవీకే ఓటు వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ సినిమా సెకండాఫ్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అది పూర్తయ్యాక షెడ్యూలు వేస్తారు.

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు