లగడపాటి.. ఇదే ఆఖరు సర్వే?

నాన్నా పులి కథ తెలిసిందే కదా? ఒక్కొసారి వ్యవహారాలు అలాగే వుంటాయి. లగడపాటి సర్వే ఇలాగే తయారైంది. పాపం, గడచిన తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన డ్రామా బెడిసికొట్టడంతో, మరి మరోసారి సర్వేల జోలికి…

నాన్నా పులి కథ తెలిసిందే కదా? ఒక్కొసారి వ్యవహారాలు అలాగే వుంటాయి. లగడపాటి సర్వే ఇలాగే తయారైంది. పాపం, గడచిన తెలంగాణ ఎన్నికల్లో ఆయన చేసిన డ్రామా బెడిసికొట్టడంతో, మరి మరోసారి సర్వేల జోలికి వెళ్లరు అనుకున్నారు అంతా. కానీ ఆంధ్ర ఎన్నికల వేళ మళ్లీ మరోసారి లైన్లోకి వచ్చారు.

కానీ పాపం సమస్య ఏమిటంటే, ఆయన సర్వే నిజం అవుతుందా? కాదా? అన్న సంగతి పక్కనపెడితే, ఎవ్వరూ సీరియస్ గా తీసుకోకపోవడం దారుణం. ఒక్క తెలుగుదేశం అనుకూల మీడియా ఇచ్చిన భయంకరమైన కవరేజ్ తప్ప, జనాలు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దీనికి కేవలం తెలంగాణ ఎన్నికల టైమ్ లో చేసిన సర్వే ఫెయిల్ కామడం ఒక్కటే కారణం కాదు.

గత కొన్నేళ్లుగా లగడపాటి ఎక్కువగా చంద్రబాబుతో రాసుకుని, పూసుకుని వుంటూ వస్తున్నారు. ఆయన వేల వేల కోట్లు బ్యాంకు అప్పుల్లో వున్నారని వార్తలు వున్నాయి. ఆయన నాకు అప్పులు లేవు అనోచ్చుకానీ, అప్పులు తీసుకున్నవి అన్నీ ఆయన కంపెనీలే. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక లాంకోకి కొన్ని మేళ్లు చేకూర్చారని వార్తలు వినవచ్చాయి.

ఇవన్నీ ఇలావుంటే ఇటీవలే లగడపాటి అమెరికాలో పర్యటించినపుడు, చేసిన ప్రసంగాల్లో తన సర్వే ఫలితాలు ఎలా వుండబోతున్నాయో వెల్లడించేసారు. అభివృద్ధి చేసిన వారికే పట్టం కట్టబోతున్నారని అప్పుడే చెప్పారు. జగన్ పవర్ లోనే లేరు. అలాంటిది అభివృద్ధి చేయడం ఎలా సాధ్యం? రీ పోలింగ్ వున్న వేళ ప్రెస్ మీట్ పెట్టి, అన్యాపదేశంగా జనాలు తెలుగుదేశాన్నే గెలిపిస్తున్నారని చెప్పడం కూడా లగడపాటి శీలానికి మరో మచ్చ అయింది.

ఇవన్నీ ఇలావుంటే లగడపాటి, ఆయనతో డేటా షేర్ చేసుకుని టుడేస్ చాణక్య తప్ప మరెవరు ఆయన ఫలితాలతో ఏకీభవించకపోవడం కూడా ఈ సర్వే మీద ఆసక్తిని చంపేసింది. అయితే తెలుగుదేశం జనాలు అయినా నమ్ముతారా? అంట, బాబుగారు తన పదవి నుంచి దిగిపోయేలోగా, లాంకో సంస్థకు పది పన్నెండేళ్లు మేలు జరిగేలా పావులు కదుపుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో మొత్తం సర్వేనే అనుమానించాల్సిన పరిస్థితి వచ్చేసింది.

సర్వేలు నెగిటివ్ గా వస్తున్నాయని చంద్రబాబుకు ముందే తెలుసు. ఈ విషయం ఆయనే చెప్పారు. నెగిటివ్ గా వస్తాయి. నమ్మకండి అని. బహుశా అందుకనే ఈ సర్వే ప్లాన్ చేయించి వుంటారు అనే అనుమానంతో వార్తా కథనాలు వెలువడ్డాయి.

మొత్తంమీద అన్నీ కలిసి ఇప్పుడు లగడపాటి సర్వేను అనుమానంలో పడేసాయి. నమ్మకుండా చేసాయి. ఈ సారి సర్వేనిజమైతేనే ఇంకపై లగడపాటి సర్వేకు మళ్లీ ఆస్కారం, ఆదరణం వుంటుంది. లేదూ అంటే ఇదే ఆఖరి సర్వే అవుతుంది.

ప్రజల్లో మేరానామ్ జోకర్?!

ఎమ్బీయస్‌: బెదురు బాబు