Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తేజుకి హీరోయిన్ కావాలి

తేజుకి హీరోయిన్ కావాలి

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఓ రేంజ్ లో వుంది. సరైన హీరోయిన్లే లేరు అని చెప్పుకోవాల్సిందే. సినిమాలు హిట్ అయినా, ఫట్ అయినా, లెగ్ అనిపించినా, వాళ్లలోంచే ఏరుకోవాలి తప్ప కొత్తగా హీరోయిన్ల దొరకడంలేదు. పెద్ద హీరోల పక్కన హీరోయిన్లు అంటే కాస్త ఖర్చుకు జంకకుండా తెచ్చుకుంటారు. పైగా పెద్ద హీరో పక్కన హీరోయిన్ అంటే ఆటోమెటిక్ గా ప్లస్ అయిపోతుంది.

కానీ చిన్న, మీడియం హీరోయిన్ల వ్యవహారం అలా కాదు. కాస్త పాపులర్ అయిన, నొటెడ్ అయిన హీరోయిన్ వుండాల్సిందే. జెర్సీలో శ్రద్ధ శ్రీనాధ్ వ్యవహారానికి, మజిలీలో సమంత వ్యవహారానికి తేడాచూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం విషయానికి వస్తే, సాయితేజ్ ఓ సినిమాను డైరక్టర్ మారుతితో చేయబోతున్నారు. ఆ సినిమాకు హీరోయిన్ కావాలి. వేట సాగుతున్నట్లు బోగట్టా. 

మారుతి కథకు మ్యాచ్ కావాలి. హీరో పక్కన సెట్ కావాలి. బడ్జెట్ సరిపోవాలి. అన్నింటికి మించి ఇంతో అంతో జనాలకు పరిచయం వుండాలి. సినిమా జనాల సెంటిమెంట్ ప్రకారం కాస్త హిట్ ట్రాక్ వున్న హీరోయిన్ అయితే బెటర్. ఇన్ని క్వాలిటీస్ మ్యాచ్ కావడం అంటే కష్టమే.

ఇప్పుడున్న మీడియం హీరోయిన్లు ఎవ్వరూ హిట్ ట్రాక్ లో లేరు. రష్మిక తప్ప. ఆమె బిజీ. రాశీ, అనుపమ ఆ లైన్ వాళ్లందరితో సాయితేజ్ చేసేసాడు. నిధి అగర్వాల్ లాంటి హిట్ గ్రాఫ్ లేని హీరోయిన్లు మాత్రమే వున్నారు. మరి వీళ్లందరిలోంచి మారుతి-తేజు కలిసి ఎవర్ని ఏరుకుంటారో. ఏమైనా కొత్త కొత్త హీరోయిన్లను దిగుమతి చేయడం కాస్త తగ్గినట్లు కనిపిస్తోంది టాలీవుడ్ లో.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?