Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అంతుపట్టని బోయపాటి అంతరంగం?

అంతుపట్టని బోయపాటి అంతరంగం?

తెలుగులో టాప్ డైరక్టర్లలో బోయపాటి శ్రీనివాస్ ఒకరు. అందులో సందేహంలేదు. వినయ విధేయరామ సినిమా బోయపాటికి గట్టి బ్రేక్ వేసేసింది. ఎక్కడ తేడా వచ్చిందో కానీ, బాలయ్యతో సినిమా అబేయన్స్ లో పడింది. బోయపాటికి ఇప్పుడు కింకర్తవ్యమ్? అన్నట్లు వుంది పరిస్థితి. ఏం చేయాలో తేల్చుకోలేని పరిస్థితి.

పెద్ద హీరోలు అందుబాటులో లేకపోవచ్చు కానీ బోయపాటి చేస్తాను అంటే ఒకరు కాకుంటే ఇంకొకరు అయినా ఓకె అనే అవకాశం వుంది. కానీ అలా వెళ్లాలంటే బాలయ్యతో సినిమా సంగతి క్లియర్ కట్ గా తేలాలి. అదే తేలడంలేదు అని తెలుస్తోంది. అందుకే బోయపాటి మనసులో ఏముంది? అన్నది తెలియకుండా వుంది.

కొంతమంది ప్రొడ్యూసర్లు అయితే బోయపాటి ఓకె అంటే రీజనబుల్ బడ్జెట్ లో సినిమా చేయాలనే అనుకుంటున్నారు. కానీ బోయపాటి వారికి ఏ సంగతీ చెప్పడంలేదని తెలుస్తోంది. ఆయనకు ఎలాగైనా బాలయ్యతో సినిమా చేయాలనే వున్నట్లు బోగట్టా. బాలయ్యతో కాంబినేషన్ అయితేనే మళ్లీ ఆ క్రేజ్, ఆ ఊపు వస్తుందని ఆయన భావన. ప్రస్తుతం అయితే బాలకృష్ణ తన పనుల్లో, షూటింగ్ ల్లో బిజీగా వున్నారు. అదీకాక ఆ ఇద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.

ఇదిలావుంటే ఓ పెద్ద హీరోను, బోయపాటిని కలపాలని ఓ పెద్ద బ్యానర్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు బోగట్టా. అయితే బోయపాటితో డిస్కషన్ల వరకు జరుగుతున్నాయి కానీ, అవుట్ కమ్ మాత్రం ఇంకా రాలేదు. మరి బోయపాటి ఎప్పుడు ఊ అంటారో? చూడాలి.

వంద సీట్ల మార్కును అందుకోవడంపై వైఎస్సార్సీపీ విశ్వాసం!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?