Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తెలుగులోకి బదాయి హో

తెలుగులోకి బదాయి హో

వైవిధ్యమైన సినిమాలను తెలుగువాళ్లు ఆదరిస్తారు అన్న నమ్మకం ఇప్పడిప్పుడే ఏర్పడుతోంది. హీరోయిజం, వాణిజ్యపరమైన అంశాలు వున్న సినిమాలను చూస్తూనే, వైవిధ్యమైన కథాంశం వున్న సినిమాలను నెత్తిన పెట్టుకుంటున్నారు. అందుకే ఈ ధైర్యంతోనే నిర్మాత దిల్ రాజు ఓ హిందీ సినిమాను తెలుగులోకి తీసుకువస్తున్నారు.

హిందీలో మంచి హిట్ అయిన బధాయి హో సినిమాను తెలుగులో నిర్మించబోతున్నారు. హిందీ నిర్మాత బోనీకపూర్ తో కలిసి ఈ సినిమాను దిల్ రాజు తెలుగులో నిర్మిస్తారు. బోనీకపూర్ ఈ మధ్య ఎక్కువగా సినిమా నిర్మాణాల మీద దృష్టిపెట్టిన సంగతి తెలిసిందే. అలాగే బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు పలు ప్రాజెక్టులు ప్లాన్ చేస్తున్నారు కూడా.

అందులో భాగంగానే ఇప్పుడు బధాయి హో సినిమాను తెలుగులో చేయాలని డిసైడ్ అయ్యారు. మధ్యతరగతి నేపథ్యంలో మాంచి ప్రేమకథను రన్ చేస్తూ తీసిన బధాయి హో తెలుగులో కూడా మాంచి యూత్ టచ్ వున్న ఫ్యామిలీ సినిమాగా తీయాలనే ఆలోచన చేస్తున్నారు. నాగచైతన్య వంటి హీరోను సెట్ చేయాలనే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కొద్దిరోజుల్లో క్లారిటీ వస్తుంది.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?