Advertisement

Advertisement


Home > Politics - Gossip

అప్పుడు బాబు దర్శకత్వం.. ఇప్పుడు బీజేపీ డైరక్షన్

అప్పుడు బాబు దర్శకత్వం.. ఇప్పుడు బీజేపీ డైరక్షన్

ఎన్నికలకు ముందు నుంచే చంద్రబాబు-పవన్ మధ్య ఓ లోపాయికారీ ఒప్పందం ఉంది. ఎవరు ఔనన్నా-కాదన్నా ఇది నిజం. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్లిద్దరి బంధం ఇంకాస్త ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. అధికారికంగా కలవడమే ఆలస్యం అన్నట్టుంది ఈ రెండు పార్టీల వ్యవహారం. అలా మొన్నటివరకు బాబు డైరక్షన్ లో పనిచేసిన జనసేనాని, ఇప్పుడు బీజేపీ డైరక్షన్ లోకి మారారు. జగన్ పై విమర్శలు చేసే విషయంలో ఇకపై భారతీయ జనతా పార్టీ దర్శకత్వంలో వర్క్ చేయాలని పవన్ భావిస్తున్నారు.

100 రోజుల జగన్ పాలనపై జనసేనాని పవన్ కల్యాణ్ త్వరలో స్పందించబోతున్నారు. ఇప్పటివరకూ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేసిన పవన్ ఈ స్పందనలో మాత్రం తన రాజకీయ చాణక్యం ప్రదర్శించబోతున్నారట. జనసేన కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం జగన్ సర్కారు పనితీరుపై స్పందిస్తానని గతంలో చెప్పిన పవన్ కల్యాణ్, ఇప్పుడు బీజేపీ సూచనల మేరకు నడుచుకోబోతున్నారట. ఇన్నాళ్లూ టీడీపీతో కలిసి వైసీపీ పాలనపై దుమ్మెత్తిపోసిన పవన్, ఓవరాల్ గా జగన్ 100 రోజుల పాలనపై పాజిటివ్-నెగెటివ్ మిక్స్ చేస్తూ ఓ స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నట్టు సమాచారం.

అయితే ఇందులో కూడా జనసేనని ఎలివేట్ చేసుకోబోతున్నారు పవన్. రాజధాని రైతులకు కౌలు విడుదల చేసిన విషయంలో.. తన పోరాటానికి ఫలితం దక్కిందని పవన్ చెప్పుకోబోతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి శంకుస్థాపన చేయడాన్ని కూడా తన విజయంగానే పవన్ ప్రస్తావించబోతున్నారు. ఇలా.. రాష్ట్రంలో జగన్ చేపట్టిన పలు పథకాలకు, జనసేన పోరాటాలకు ఏదో ఒకచోట లింక్ పెట్టి.. పవన్ కల్యాణ్ స్టేట్ మెంట్ విడుదల చేయబోతున్నారు.

ఇన్నాళ్లూ టీడీపీ రెచ్చగొట్టడంతో జగన్ పై ఏకపక్షంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు పవన్. దీంతో జనంలో కూడా పలుచన అయ్యారు. సరిగ్గా ఇక్కడ బీజేపీ అధినాయకత్వం రంగప్రవేశం చేసి పవన్ కు దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు జగన్ ని తీవ్రంగా విమర్శిస్తే ఎవరికీ లాభం ఉండదని, కొన్నిరోజులు వేచిచూడాలని సూచించింది.

పవన్ కు బీజేపీతో ఎప్పుడూ సత్సంబంధాలున్నాయి. కాకపోతే ఆయన ఆ విషయాన్ని బయటకు చెప్పరంతే. జనసేన, బీజేపీకి మధ్య చాలా మంచి సంబంధాలున్నాయని, జనసేన పార్టీకి ఆర్థిక అండదండలు కూడా బీజేపీ నుంచే అందుతున్నాయనే కామెంట్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే బీజేపీ సూచనల మేరకు ఇప్పుడు జగన్ పై పవన్ తన వ్యవహారశైలిని మార్చుకుంటున్నట్టు తెలుస్తోంది.

జగన్‌ పాలన.. 'హాఫ్‌' మార్కును చేరిన అభినందనలు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?