తెలుగులోకి ‘ఆమె’ వస్తోంది

గాత్రం అన్నది భగవంతుడు ఇచ్చే వరం. అందరికీ అది సాధ్యం కాదు. అయితే సుస్వరమైన స్వరం వున్నా, కంటి చూపు లేని గాయకురాలు వైకోమ్ విజయలక్ష్మి. మలయాళ చిత్రాల్లో అనేక పాటలు పాడిన ఈ…

గాత్రం అన్నది భగవంతుడు ఇచ్చే వరం. అందరికీ అది సాధ్యం కాదు. అయితే సుస్వరమైన స్వరం వున్నా, కంటి చూపు లేని గాయకురాలు వైకోమ్ విజయలక్ష్మి. మలయాళ చిత్రాల్లో అనేక పాటలు పాడిన ఈ అపూర్వ గాయనిని ఇప్పుడు తెలుగుకు పరిచయం చేస్తున్నారు మ్యూజిక్ డైరక్టర్ థమన్. 

వైకోమ్ విజయలక్ష్మి కేవలం గాయని మాత్రమే కాదు,. గాయత్రి వీణ ను అద్భుతంగా శృతిచేసి వినిపించగలరు. పవన్ కళ్యాణ్ అయ్యప్పన్ రీమేక్ లో రెండు మాంచి మాంటేజ్ సాంగ్ లు వున్నాయి. 

అరవింద సమేతలో మాదిరిగా ఈ మాంటేజ్ సాంగ్ లను కూడా హిట్ చేయాలనే సంకల్పంతో, ఒకదాన్ని పెంచలదాస్ చేత పాడిస్తున్నారు. మరో పాటను ఈ మలయాళం సింగర్ తో పాడించారు.

అయ్యప్పన్ లో పాటల ట్యూన్ లు, రికార్డింగ్ అన్నీ ఇటీవలే పూర్తయ్యాయి. ఆ ఆల్బమ్ పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో వున్నారు మేకర్లు. అల వైకుంఠపురములో తరువాత థమన్-తివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అడియో కాబట్టి మంచి అంచనాలు వున్నాయి ఈ సినిమా మీద.