వెటరన్ ప్రొడ్యూసర్ ఎమ్ ఎస్ రాజు ఫుల్ టైమ్ డైరక్టర్ గా మారిన తరువాత ఫుల్ స్పీడ్ లో వున్నారు. డర్టీ హరి సినిమా ఫినిష్ చేసి, సెవెన్ డేస్ సిక్స్ నైట్స్ అనే సినిమా స్టార్ట్ చేసారు.
అది పూర్తి కాకుండానే మరో సినిమాకు శ్రీకారం చుట్టేస్తున్నారు. తన స్వంత బ్యానర్ పై, తన కొడుకు నిర్మాతగా ఆయన ఈ సినిమా తీయబోతున్నారు.
ఈ సినిమాకు హరికథ అని టైటిల్ ఫిక్స్ చేయడం విశేషం. అయితే హీరో ఎవరు, జోనర్ ఏమిటి అన్నది ప్రస్తుతానికి రివీల్ చేయడం లేదు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభించి సంక్రాంతి బరిలోకి తేవాలని ప్లాన్. సినిమా షూటింగ్ ప్రారంభించినపుడు హీరో ఎవరు అన్నది రివీల్ చేస్తారు.
మొత్తానికి లేటు వయసులో ఘాటు సినిమాలు బాగానే తీసేస్తున్నారు ఎమ్ ఎస్ రాజు ఎటొచ్చీ ఆయన రేంజ్ భారీ సినిమా ఎప్పుడు తీస్తారో అన్నది జవాబు రాని ప్రశ్న.