ఎన్టీఆర్ గత చిత్రం ‘రభస’కి విడుదలకి ముందు అస్సలు అంచనాలు ఏర్పడలేదు. దానికి తోడు ఫ్లాప్ టాక్ రావడంతో కనీసం ముప్పయ్ కోట్ల షేర్ అయినా తెచ్చుకోలేకపోయింది. కానీ రెండు డిజాస్టర్స్ తర్వాత వస్తున్న ‘టెంపర్’ మాత్రం బాగానే ఎక్సయిట్ చేస్తోంది. పూరి జగన్నాథ్ పూర్ ఫామ్లో ఉన్నా కానీ ‘టెంపర్’ డైలాగులు, సాంగ్ క్లిప్పింగులు చూస్తుంటే ఫాన్స్కి ఆశలు పుడుతున్నాయి.
‘డిపార్ట్మెంట్ పరువు తీయడానికే పుట్టా..’, ‘నా పేరు దయ.. నాకు లేనిదే అది’, ‘జీవితం ఎవడ్నీ వదిలిపెట్టదు.. అందరి సరదా తీర్చేస్తది’ వగైరా డైలాగులు ఆల్రెడీ సూపర్ పాపులర్ అయిపోయాయి. సింగిల్ యూట్యూబ్ ఛానల్లో వన్ మిలియన్ వ్యూస్ ట్రెయిలర్కి వచ్చేసాయి. దీనిని బట్టే అర్థమవుతోంది టెంపర్ ఫీవర్ బాగా ముదిరిందని.
బ్యాడ్ సీజన్లో రిలీజ్ అవుతున్నా కానీ విడుదలకి ముందు కావాల్సిన హైప్ బాగా క్రియేట్ అయింది. సినిమాని రీజనబుల్ రేట్లకి అమ్ముతున్నారు కనుక డీసెంట్ టాక్ వస్తే ‘టెంపర్’ సక్సెస్ అవడం ఇంకాస్త ఈజీ అయిపోతుంది. అయితే ఎన్టీఆర్కి కావాల్సింది జస్ట్ హిట్ కాదు. సింహాద్రి తర్వాత తనకి దక్కని ఆ బ్లాక్బస్టర్ లోటుని పూరి ‘టెంపర్’ పూడుస్తుందా లేదా అనేదే చూడాలి.