గబ్బర్‌సింగ్‌లో అతని హ్యాండు కూడా

ఎప్పుడు మొదలు పెడతాడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ గబ్బర్‌సింగ్‌ 2 స్క్రిప్టుపై మాత్రం ఇంకా వర్క్‌ జరుగుతూనే ఉంది. రెండేళ్లకి పైగా ఒక సినిమా స్క్రిప్టుపై ఇంతమంది వర్క్‌ చేయడం ఇదేనేమో.…

ఎప్పుడు మొదలు పెడతాడనే దానిపై ఇంకా క్లారిటీ లేదు కానీ గబ్బర్‌సింగ్‌ 2 స్క్రిప్టుపై మాత్రం ఇంకా వర్క్‌ జరుగుతూనే ఉంది. రెండేళ్లకి పైగా ఒక సినిమా స్క్రిప్టుపై ఇంతమంది వర్క్‌ చేయడం ఇదేనేమో. ‘పవర్‌’ డైరెక్టర్‌ బాబీ చేతికి ఈ ప్రాజెక్ట్‌ వెళ్లాక అతను స్క్రిప్టుపై రీవర్క్‌ స్టార్ట్‌ చేసాడు. 

కథ, కథనం ఖరారు కావడంతో ఇప్పుడు డైలాగ్‌ వెర్షన్‌ రెడీ చేస్తున్నారు. కోన వెంకట్‌ ఈ చిత్రానికి డైలాగ్స్‌ రాస్తున్నాడని సమాచారం. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా హిట్‌ సినిమాల్లో కోన వెంకట్‌ కాంట్రిబ్యూషన్‌ ఉండడంతో ‘గబ్బర్‌సింగ్‌ 2’కి కూడా అతని లక్కీ హ్యాండ్‌ కలిసొస్తుందనే అనుకుందాం. 

సెట్స్‌ మీదకి వెళితే సింగిల్‌ షెడ్యూల్‌లో షూటింగ్‌ పూర్తి చేయడానికి అనువుగా బౌండ్‌ బుక్‌తో రెడీ అవుతున్నారు. లొకేషన్స్‌ వగైరా అన్నీ ఫైనలైజ్‌ చేసేస్తున్నారు. అన్నీ రెడీగా ఉన్నా ఇంకా గబ్బర్‌సింగ్‌ మాత్రం ఈ ప్రాజెక్ట్‌ కోసం ఫుల్‌ ఫిట్‌నెస్‌ సంతరించుకోలేదు. వన్స్‌ పవన్‌కళ్యాణ్‌ రెడీ అంటే గబ్బర్‌సింగ్‌ షూటింగ్‌ వాయువేగంతో పూర్తయిపోతుందన్నమాట