టెంపర్-నిర్మాతకు మిగలని ఆనందం

ఒక్కోసారి ఒక్కొక్కరి జాతకాలు అంతే..ఎలాగో లేచి, ఎలాగో పడి, ఇంకెలాగో మారిపోతాయ్. బండ్ల గణేష్ అనే నటుడు కమ్ నిర్మాత జాతకం ఇలాంటిదే. నిర్మాతగా ఎంటర్ కావడమే భారీ సినిమాలతో ఎంటర్ అయ్యాడు. పలు…

ఒక్కోసారి ఒక్కొక్కరి జాతకాలు అంతే..ఎలాగో లేచి, ఎలాగో పడి, ఇంకెలాగో మారిపోతాయ్. బండ్ల గణేష్ అనే నటుడు కమ్ నిర్మాత జాతకం ఇలాంటిదే. నిర్మాతగా ఎంటర్ కావడమే భారీ సినిమాలతో ఎంటర్ అయ్యాడు. పలు హిట్ లు ఇచ్చాడు. కానీ ఇవ్వాళ ఎక్కడున్నాడు? ఏ హీరో డేట్ లు ఇవ్వని పరిస్థితి.

పవన్ కు టర్నింగ్ పాయింట్ గబ్బర్ సింగ్. అంతకు ముందు వరుస పరాజయాలు.ఎన్టీఆర్ కు టెంపర్ ముందు అన్నీ పరాజయాలే. 

టెంపర్ వచ్చి అయిదేళ్లు అయింది. ఈరోజు ఐమాక్స్ లో సంబరాలు కూడా జరిగాయి. కానీ నిర్మాత బండ్ల గణేష్ ఎక్కడున్నాడు? ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ కావచ్చు. మాట మీద నిల్చోడు అన్న ప్రచారం కావచ్చు. తను మారాను అని నిరూపించుకో లేకపోవడం వల్ల కావచ్చు బండ్ల గణేష్ అనే వ్యక్తి మళ్లీ సినిమా చేయలేకపోయాడు. 

డబ్బులు లేక ఎవరన్నా సినిమాలు చేయలేకపోతారు. కానీ బండ్ల కేస్ వేరు డబ్బులు వుండీ, పరపతి వుండీ, సినిమాలు చేయలేకపోవడం. కారణం, సినిమా జనాలు అతన్ని నమ్మకపోవడం. నమ్మకం కలిగించుకోలేకపోవడం.

ఆంజనేయలు, గబ్బర్ సింగ్, తీన్ మార్, బాద్ షా, ఇద్దరు అమ్మాయిలతో, గోవిందుడు అందరి వాడేలే, టెంపర్ దాదాపు అన్నీ డబ్బులు తెచ్చిన సినిమాలే. ఒకటి రెండు మినహా మిగిలినవన్నీ హిట్ లు అనిపించుకున్నవే. ఆయా హీరోలకు మైల్ స్టోన్ లే.

కానీ బండ్ల సినిమా కెరీర్ మాత్రం బండ్ల పాలయిపోయింది. మళ్లీ బండ్లను సినిమా జనం ఎప్పుడు నమ్ముతారో? ఆ నమ్మకం ఎప్పుడు సంపాదించుకుంటాడో? టెంపర్ గుర్తున్న వేళ బండ్ల గుర్తు లేడు అంటే అది స్వయంకృతాపరాధమేమో?

అందుకే ఆయన రాజమౌళి అనిపించింది