1980ల కాలంలో స్టూవర్ట్ పురం టైగర్ నాగేశ్వరరావు వ్యవహారం కాస్త సంచలనమే. అతని మీద రకరకాల కథనాలు వున్నాయి. దొంగ అనీ, గజదొంగ అనీ, కాదు, రాబిన్ హుడ్ టైపు అనీ, అతన్ని ఎన్ కౌంటర్ చేయడానికి అతడి ప్రియురాలిని పోలీసు అధికారి లోబరుచుకున్నారని ఇలా ఎన్నో కథలు. మొత్తంమీద ఓ సినిమా కథకు కావాల్సిన ముడిసరుకు వుంది టైగర్ నాగేశ్వరరావు జీవితంలో. అందుకే ఆ స్క్రిప్ట్ తో ఒక సినిమా రెడీ చేస్తున్నారట.
దొంగాట సినిమా చేసిన వంశీకృష్ణ డైరక్షన్ లో ఈ సినిమాకు ప్లాన్ చేస్తోంది ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఆ మధ్య ఇదే సంస్థలో వంశీకృష్ణ ఓ సినిమా చేసాడు రాజ్ తరుణ్ హీరోగా. ఇది మరో సినిమా అన్నమాట. అయితే టైగర్ నాగేశ్వరరావు లాంటి మాస్ క్యారెక్టర్ కు ఎవర్ని ఛూజ్ చేసుకుంటారో? పైగా పీరియాడికల్ సినిమా కాబట్టి కాస్త ఖర్చు వుంటుంది.
ఇవన్నీ సెట్ అయిన తరువాత ఈ 'టైగర్' సినిమా సెట్ మీదకు వెళ్తుంది.