తేరుకుంటున్న థియేటర్లు

కరోనా రెండో ఫేజ్ అనంతరం థియేటర్లు తెరచుకున్నాయి. కానీ మొదటి రోజు ఆశించన రేంజ్ స్పందన కనిపించలేదు. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, సెకెండ్ షో లేకపోవడంతో పెద్దగా ఫిగర్లు కనిపించలేదు.  Advertisement రెండో…

కరోనా రెండో ఫేజ్ అనంతరం థియేటర్లు తెరచుకున్నాయి. కానీ మొదటి రోజు ఆశించన రేంజ్ స్పందన కనిపించలేదు. పెద్ద సినిమాలు విడుదల కాకపోవడం, సెకెండ్ షో లేకపోవడంతో పెద్దగా ఫిగర్లు కనిపించలేదు. 

రెండో రోజు శనివారం కావడంతో కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయి. తిమ్మరసు సినిమాకు మరీ నెగిటివ్ టాక్ లేకపోవడంతో, తొలి రోజు కన్నా కలెక్షన్లు పెరిగాయి. మౌత్ పబ్లిసిటీతో కొన్ని చోట్లు ఫుల్స్ మరి కొన్ని చోట్ల మంచి ఆక్యుపెన్సీ వచ్చింది. ఆదివారం నాటికి ఇంకా ఇంప్రూవ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

హైదరాబాద్ ఎ ఎబ్ బి మాల్ లాంటి చోట్లు థియేటర్లకు జనం రావడం మెరుగైంది. సినిమాలతో సంబంధం లేకుండా థియేటర్లకు మళ్లీ జనం రావడం అన్నది పాజిటివ్ సైన్ అని ఎ ఎమ్ బి మాల్ సునీల్ నారంగ్ అన్నారు. 

ఆదివారం నుంచి ఆంధ్రలో పూర్తి స్థాయిలో థియేటర్లు తెరుస్తున్నారు. ఈస్ట్ గోదావరిలోని మెయిన్ సెంటర్లు అన్నింటిలో ఆదివారం నుంచి థియేటర్లు తెరచుకుంటున్నాయి.

దీనివల్ల జనాలు మళ్లీ సినిమాలకు అలవాటు పడతారని టాలీవుడ్ జనాలు హ్యాపీ ఫీలవుతున్నారు.