Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తగ్గుతున్న రష్మిక హవా.. కొత్త కెరటం కియరా!

తగ్గుతున్న రష్మిక హవా.. కొత్త కెరటం కియరా!

చేతినిండా అవకాశాలున్నా సౌత్‌లో కొంతమంది హీరోయిన్లు రకరకాలుగ క్రిటిసిజమ్‌ను, ట్రోలింగ్స్‌ను ఎదుర్కొనాల్సి వస్తోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్‌లలో అవకాశాలను కలిగి ఉన్న వీళ్లు ఫ్యాన్స్‌ నుంచి, సోషల్‌ మీడియా నుంచి చిత్రమైన క్రిటిసిజమ్‌ను ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విమర్శలను ఎదుర్కొంటూనే వాళ్లు తమ ప్రయత్నాలను తాము సాగిస్తూ ఉన్నారు. ప్రస్తుతం లీడింగ్‌లో ఉన్న హీరోయిన్లలో విచిత్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న వారి జాబితాను ఒకసారి పరిశీలిస్తే..

ఇలా హాఫ్‌ సెంచరీ వయసును దాటేసిన హీరోలతో జత కడుతూ ఉంది రకుల్‌ప్రీత్‌ సింగ్‌. కెరీర్‌ ఆరంభించింది కుర్రాళ్ల సినిమాలతో. అయితే ఈమె హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసి పదేళ్లు అవుతున్నాయి. అప్పుడు చిన్న స్థాయి సినిమాల్లో, కుర్రాళ్ల సరసన నటించింది. అలాచేయగా చేయగా తెలుగులో 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌' రూపంలో హిట్‌ లభించింది. అక్కడ నుంచి రకుల్‌ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది. పెద్ద హీరోలతో అవకాశాలు సంపాదించింది. మరోవైపు నాగచైతన్య వంటి హీరోలతో లవ్‌ స్టోరీల్లో నటిస్తూ యూత్‌ను ఆకట్టుకుంది. అయితే ఒక్కసారిగా ఆమె నాగచైతన్య సినిమా నుంచి నాగార్జున సినిమా వైపు వెళ్లిపోవడంతో రకుల్‌కు ఏజ్డ్‌ హీరోల హీరోయిన్‌ అనే ట్యాగ్‌ పడుతోంది. హిందీలో అలాంటి సినిమాలు చేయడంతో ఆ ముద్ర మరింత గట్టిగా పడుతోంది.

అయితే అలాంటి విమర్శల విషయంలో రకుల్‌ ఎదురుదాడి చేస్తూ ఉంది. తను యంగ్‌ హీరోల సరసన కూడా నటిస్తున్నాను అనేది ఆమె వాదన. అందులో భాగంగా కార్తీ, సూర్యల సరసన నటించిన సినిమాలను ఉదాహరిస్తూ ఉంది. అలాంటి సినిమాలు మీకు కనపడవా? అంటూ విమర్శకుల మీద ఎదురుదాడి చేస్తూ ఉంది రకుల్‌. అయితే వాటిని పట్టించుకునే వారులేరు. ఇండస్ట్రీలో క్రిటిసిజమ్‌కు ఎక్కువ ఆస్కారం ఉంటుంది కాబట్టి.. రకుల్‌కు ఏజ్డ్‌ హీరోల హీరోయిన్‌ అనేముద్ర మాత్రం గట్టిగాపడుతూ ఉంది.

యంగ్‌ హీరోల సరసన మరో అవకాశాన్ని సంపాదించి మరో హిట్‌ పడితే తప్ప రకుల్‌కు మళ్లీ పాత ఇమేజ్‌ రాదు. కానీ అదంత తేలికకాదు. అయితే ఇక్కడ ఆమెకో అడ్వాంటేజ్‌ ఉంది. ఎలాగూ సౌత్‌ ఇండస్ట్రీలో ఇప్పుడు 50 దాటిన, 60కి రీచ్‌ అయిన హీరోలు చాలామందే ఉన్నారు. బాలీవుడ్‌లోనూ అలాంటి పరిస్థితే ఉంది. ఇలాంటి నేఫథ్యంలో రకుల్‌ప్రీత్‌ ఆ లీగ్‌లోని హీరోలతో సెటిల్‌ అయితే ఆమెకే మరిన్ని అవకాశాలు వస్తాయి. ఎలాగూ వారంతా స్టార్‌ హీరోలు, పెద్ద హీరోలు, భారీ బడ్జెట్‌ సినిమాలు. కావాల్సినంత పారితోషకాన్ని డిమాండ్‌ చేసే అవకాశం ఉంది. బహుశా రకుల్‌కు ఇక మిగిలిన ఆప్షన్‌ అదేనేమో!

'దేవదాస్‌' సినిమా ఆకట్టుకోలేకపోవడం దానికి మించి భారీ అంచనాల మధ్యన వచ్చిన 'డియర్‌ కామ్రేడ్‌' అంచనాలను అందుకోలేకపోవడంతో రష్మికకు ఇబ్బందికరంగా మారింది. గీతగోవిందం తర్వాత అంతకు మించిన హిట్‌ను ఎక్స్‌పెక్ట్‌ చేశారు ఫ్యాన్స్‌. అయితే రష్మిక నటించిన సినిమాలు ఏవీ కూడా ఆ తర్వాత హిట్‌ అనిపించుకోలేకపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పుడే రష్మిక గ్రాఫ్‌ పడిపోతుందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి!

నిన్నమొన్నటి వరకూ రష్మికను తమ సినిమాల్లో నటింజేయాలని ప్రముఖ హీరోలు కూడా తెగ ప్రయత్నించారట. అయితే ఇప్పుడు వారికే ఆమెపై ఆసక్తి తగ్గుతోందని టాక్‌. తెలుగులో ఈమె ఊపును చూసి ఈమెకు తమిళంలోనూ అవకాశాలు ఇవ్వడానికి కొందరు ముందుకు వచ్చారట. అయితే 'డియర్‌ కామ్రేడ్‌' తేలిపోయిన తర్వాత మాత్రం ఈమెకు అవకాశాలు తగ్గుముఖం పడుతూ ఉన్నాయని ఇండస్ట్రీ టాక్‌!

ఇక ఊపు మీదున్న యంగ్‌ హీరోలెవరూ కాజల్‌కు తమ సినిమాల్లో అవకాశాలు ఇవ్వడంలేదు. స్టార్‌ హీరోయిన్లతో నటించాలని ఉబలాటపడే బెల్లకొండ సాయి లాంటి వారికి మాత్రం కాజల్‌ గొప్ప వరంగా మారింది. ఇక 'రణరంగం'లో ఏ మాత్రం ప్రాధాన్యత లేని పాత్ర చేసిందనే విమర్శ కాజల్‌ విషయంలో వచ్చింది. అయితే కాజల్‌ మాత్రం వీలైనంతగా సినిమాలు చేయడానికే మొగ్గుచూపుతూ ఉంది. బోనస్‌ కెరీర్‌లో ఏ సినిమాలు వచ్చినా వదులుకోకూడదన్నట్టుగా ఈమె వ్యవహరిస్తున్నట్టుంది.

విశేషం ఏమిటంటే కియరాకు సౌతిండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ మరిన్ని అవకాశాలతో వెల్కమ్‌ చెబుతూ ఉంది. రామ్‌ చరణ్‌తో ఈమె చేసిన సినిమా డిజాస్టర్‌గా నిలిచినా.. మరిన్ని అవకాశాలు అయితే ఖాయం అవుతున్నాయట. తమిళులు కూడా కియరాకు అవకాశాలు ఇవ్వడానికి సై అంటున్నారట. రష్మికను ముందుగా హీరోయిన్‌గా అనుకుని, ఆమె ఊపు తగ్గడంతో ఆమెను పక్కనపెట్టి కియరాను హీరోయిన్‌గా పరిగణనలోకి తీసుకుంటున్నారట తమిళతంబీలు!

‘బాహుబలి’ రికార్డ్స్ ను ‘సాహో’ అధిగమిస్తుందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?