మాతృత్వం ఒక వరం. పిల్లల్ని కన్న ప్రతి స్త్రీ పుణ్యాత్మురాలే. అయితే పిల్లలు పుట్టాక అందగత్తెలకు ఎంతో అసౌకర్యం వుంటుంది. యువతిగా వున్నప్పటి అందం తల్లి అయ్యాక వుండదని ఐశ్వర్యారాయ్‌ని చూస్తే అర్థమవుతుంది. ఇండియాలో శ్రీదేవి తర్వాత అంతటి అందగత్తెగా పేరు సంపాదించుకున్న ఐశ్వర్యారాయ్ ఒక పాపకు జన్మనిచ్చాక బాగా లావయిపోయింది.
పిల్లల్ని కావాలనుకునేముందు చాలా మంది సెలబ్రిటీలు అద్దె గర్భం గురించి ఆలోచిస్తారు. అయితే అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ మాత్రం సహజంగా తమ వంశ లక్షణాలుగల పిల్లల్నే కోరుకున్నారు కాబట్టి ఐశ్వర్యారాయ్ తల్లి అయ్యింది. ఐశ్వర్యకు ఇంకా నటించమని చాలా ఆఫర్స్ వస్తున్నాయట. అయితే సాగిపోయిన తన అందాలలో బిగువు తెచ్చుకోవడానికి ఆపరేషన్స్ లాంటివి చేయించుకోకుండా సహజంగానే యోగా, వర్కవుట్లతో సరిచేసుకునే పనిలో పడిందట.
మనవరాలు పెద్దదయ్యింది కాబట్టి తాను బతికుండగానే మనవడిని కూడా చూడాలని ఆరాటపడుతున్నాడట బిగ్`బి అమితాబ్ బచ్చన్. ఇప్పుడు ఐశ్వర్యారాయ్ ఫిట్నెస్ పెంచుకున్నా మళ్ళీ తల్లయితే అంతే సంగతులు. కాబట్టి ఇక గ్లామర్ ఒలకబోయేల్సిన అవసరం ఐశ్వర్యకి వుందంటారా.?