క్రమశిక్షణతో జీవించేవాడు జీవితంలో ఖచ్చితంగా పైకొస్తాడని చెబుతున్నాడు మోహన్‌బాబు. తన పిల్లలే కాదు మా విద్యా సంస్థల్లో చదివే పిల్లలంతా క్రమశిక్షణతో వుండాలని భావిస్తాడు.
తిరుపతిలోని రంగ పేటలో వున్న మోహన్‌బాబు విద్యా సంస్థల్లో చదివే పిల్లల్ని చూస్తే మిగతా కాలేజీల్లోలాగా అల్లరి చెయ్యడం గొట్టింపులు కొట్టడంగానీ, ర్యాగింగ్ చేసుకోవడాలుగానీ వుండవు. అక్కడ డ్రెస్ సెన్స్‌ని కూడా పాటించాలి. ఎవరైనా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఆ విద్యార్థికి హితబోధ చేసి, దారిలో పెడతారట.
అలాగే టైమ్‌కి భోజనం తినడం, స్కూల్‌కి రావడం ఖచ్చితంగా పటించాల్సిందే. పిల్లలే కాదు.. అక్కడ పని చేసే ఉపాధ్యాయులు కూడా మార్గదర్శకులుగా వుండాలి. అలాంటి వ్యక్తుల్నే నియమిస్తారక్కడ. సినిమాల్లో మోహన్‌బాబుకీ బయట కనబడే మోహన్‌బాబుకీ ఎంతో తేడా వుందని ఆయన్ని బాగా ఎరిగినవారికే తెలుస్తుంది.