ఈ వేసవి బాక్సాఫీస్‌ వేడి

సంక్రాంతికి విస్తుపోయిన తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని బిజీగా వుంచేందుకు జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మూడవ వారం వరకు డజను సినిమాల వరకు రంగంలో వున్నాయి. ఆ తర్వాత డల్‌ సీజన్‌కి తగ్గట్టు…

సంక్రాంతికి విస్తుపోయిన తెలుగు సినిమా బాక్సాఫీస్‌ని బిజీగా వుంచేందుకు జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మూడవ వారం వరకు డజను సినిమాల వరకు రంగంలో వున్నాయి. ఆ తర్వాత డల్‌ సీజన్‌కి తగ్గట్టు ఎక్కువ సినిమాలు విడుదల కావు కానీ మళ్లీ మార్చి 30నుంచి సందడి స్టార్ట్‌ అవుతుంది.

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల 'రంగస్థలం'తో ఈ వేసవి ఆరంభం కానుంది. టీజర్‌ చూస్తే ఇది రొటీన్‌కి భిన్నమయిన మాస్‌ ఎంటర్‌టైనర్‌ అనే ఫీలింగ్‌ వచ్చింది. ఆ తర్వాత ఏప్రిల్‌, మే నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలు భరత్‌ అనే నేను, నా పేరు సూర్య చిత్రాలు కూడా చాలా ఆకర్షణీయంగా వున్నాయి.

మహేష్‌, కొరటాల శివల భరత్‌ అనే నేను చిత్రానికి విడుదల చేసిన ప్రమాణం ఆడియో క్లిప్‌ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. ఇక అల్లు అర్జున్‌ సినిమా నా పేరు సూర్య టీజర్‌, ఫస్ట్‌ సింగిల్‌ కూడా సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. మూడు సినిమాలు ప్రామిసింగ్‌గా కనిపిస్తూ వుండడంతో వేసవి మొదలు కాకముందే బాక్సాఫీస్‌ వద్ద వేడి స్టార్ట్‌ అయింది.

ఈ చిత్రాలపై బయ్యర్లు భారీ పెట్టుబడులు పెట్టేస్తున్నారు. సంక్రాంతికి మిస్‌ అయిన సందడి సమ్మర్‌లో వస్తుందని ఆశిస్తున్నారు.