నా పేరు సూర్య. ఈ సినిమాకు ఆ మధ్య వదిలిన టీజర్ సర్రున ఎగిసి, సినిమాల మీద అంచనాలను అమాంతం పెంచేసింది. అయితే టీజర్ అంచనాలను ఎంతగా పెంచిందో, రిపబ్లిక్ డే సందర్భంగా విడుదల చేసిన పాట అంతకు అంతా అంచనాలను కిందకు దించేసిందనే చెప్పాలి.
ఈ సినిమాకు సంగీతం విశాల్ శేఖర్. కోరి తెచ్చుకున్నారు ఈ సినిమాకోసం. రామజోగయ్య శాస్త్రి 'సైనికా.. ఓ సైనికా' అంటూ రాసిన లిరిక్ బాగానే వుంది. కానీ ట్యూన్ తన్నేసిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ ట్యూన్ అలా వుంది.
ఒక విధంగా చెప్పాలంటే లిరిక్ ను ట్యూన్ మింగేసిందనే చెప్పాలి. ఫోర్స్ గా ట్యూన్ చేయడం వరకు బానే వుంది. కానీ ఒకసారి వింటే చాలదు. ఒకటికి నాలుగుసార్లు వింటే తప్ప లిరిక్ నోటికి పట్టేలా లేదు. ఇదే రామజోగయ్య శాస్త్రి గతంలో ప్రణామం.. ప్రణామం అంటూ ప్రకృతి మీద రాస్తే, ట్యూన్, లిరిక్ పెర్ ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. ఆ రేంజ్ మ్యాచ్ ఇక్కడ కనిపించలేదు.
బహుశా రామజోగయ్య శాస్త్రి కూడా అదే ఫీలయ్యివుంటారు. అందుకే ట్విట్టర్ లో పాట లిరిక్ పూర్తిగా అందించారు. ఈ పాట వరకు ఓకె. మిగిలిన పాటలు అయినా మన మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసి తీరాలి విశాల్ శేఖర్.