ఆయన ఓ సీనియర్ నిర్మాత. పాపం, దెబ్బల మీద దెబ్బలు తింటున్నాడు. ప్రతి సినిమాకు ఓ హీరోకి బాకీపడిపోతున్నాడు. ఓ ప్రేమకథా చిత్రం తీసాడు. మంచి పేరు వచ్చింది. కానీ డబ్బులు రాలేదు.
ఆ హీరో దగ్గర ఓ ప్రాపర్టీ కాగితాలు వుంచి, రెమ్యూనిరేషన్ బాకా పెట్టాడు. కొన్నాళ్లు చూసి, చూసి ఆ కాగితాలు వెనక్కు పంపేసాడు ఆ బబ్లీ ఫ్యామిలీ యంగ్ హీరో.
మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ సినిమా తీసారు. డిజాస్టర్ అయింది. ఆ సినిమా విడుదల టైమ్ లో హీరోకి కోటి రూపాయలు బాకా పెట్టారు. ఇప్పటి వరకు ఇవ్వలేదని బోగట్టా.
ఇప్పడుు మరో యూత్ ఫుల్ లవ్ స్టోరీ చేసారు. మళ్లీ అదే వ్యవహారం. ఈసారి హీరో ఊరుకో లేదు కాస్త గట్టి పట్టే పట్టాడు. దాంతో మళ్లీ రొటీన్ స్టోరీ. ఓ ప్రాపర్టీ కాగితాలు తెచ్చి హీరో చేతిలో పెట్టారు. మరి ఈసారి తీరుస్తారో? లేక హీరో వెనక్కు ఇచ్చేస్తారో? లేక ప్రాపర్టీ తీసేసుకుంటారో? వెయిట్ అండ్ సీ.