టైమ్ మెషీన్ లోకి కళ్యాణ్ రామ్

బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో బిజీగా వున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఎంత మంచివాడవురా సినిమా ఫినిష్ చేసాడు. గుహన్ డైరక్షన్ లో మరో సినిమా అనౌన్స్ చేసాడు. అది కాక మరో…

బ్యాక్ టు బ్యాక్ మూడు సినిమాలతో బిజీగా వున్నాడు హీరో కళ్యాణ్ రామ్. ఎంత మంచివాడవురా సినిమా ఫినిష్ చేసాడు. గుహన్ డైరక్షన్ లో మరో సినిమా అనౌన్స్ చేసాడు. అది కాక మరో సినిమాను కొత్త దర్శకుడితో చేయబోతున్నాడు.

మల్లిడి వేణు అనే కొత్త దర్శకుడుతో చేయబోయే ఈ సినిమాకు ఫొటో షూట్, టెస్ట్ షూట్ చేసినట్లు బోగట్టా. ఈ సినిమా కు ఆదిత్య 369 లాంటి టైమ్ మెషీన్ కాన్సెప్ట్ ఏదో తీసుకున్నట్లు తెలుస్తోంది. అయిదు వందల ఏళ్లకు ముందు, తరువాత అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా తయారవుతుందని, దీనికి బడ్జెట్ కూడా కాస్త గట్టిగానే వుంటుందని తెలుస్తోంది.

ఎంత మంచి వాడవురా సినిమా తరువాత స్టార్ట్ అయ్యేది ఈ సినిమానే. ఆ తరువాత ఈస్ట్ కోస్ట్ మూవీస్ పతాకంపై గుహన్ డైరక్షన్ లో మాస్ ఎంటర్ టైనర్ సినిమా వుంటుంది. 118 హిట్ తరువాత ఎంత మంచి వాడవురా సినిమా చేస్తున్నారు. ఇది గుజరాతీ సినిమాకు రీమేక్. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న విడుదలయ్యే ఈ సినిమాను శ్రీదేవీ మూవీస్, ఆదిత్య మ్యూజిక్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.