Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

14న బన్నీ నుంచి సర్ప్రయిజ్ ట్రీట్

14న బన్నీ నుంచి సర్ప్రయిజ్ ట్రీట్

ప్రచారం విషయంలో ఫుల్ స్పీడ్ లో వున్న బన్నీ-త్రివిక్రమ్ సినిమా అల వైకుంఠపురములో నుంచి మరో స్పెషల్ సర్ప్రయిజ్ రాబోతోంది. 15న సరిలేరు నీకెవ్వరు సినిమా నుంచి పాట వస్తుందని గ్యాసిప్ వచ్చింది. అది రావడానికి ముందుగా అంటే 14న బన్నీ సినిమా నుంచి కూడా ఓ సర్ప్రయిజ్ విడుదల వుంటుందని తెలుస్తోంది.

ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి బన్నీ చేస్తున్న సినిమా నుంచి. అవి ఫుల్ వైరల్ అయ్యాయి. మరి ఇప్పుడు మళ్లీ సర్ప్రయిజ్ అంటే మరో పాట టీజర్ అనే అనుకోవాలి. అంతకన్నా ఇప్పుడు ఇవ్వడానికి మరేం మెటీరియల్ వుంటుంది. 

అయితే అందుతున్న సమాచారం ప్రకారం 14న వదిలే పాట టీజర్ కావచ్చు, మరేదైనా కావచ్చు కానీ సర్ప్రయిజ్ అయితే తప్పదని అని మాత్రం తెలుస్తోంది. మరి బన్నీ ఇవ్వబోతున్న సర్ప్రయిజ్ ఏమిటో, ఎలా వుంటుందో, మరో నాలుగు రోజులు వేచివుంటే కానీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?