Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఆ ముగ్గురూ లక్కీ డైరక్టర్లు

ఆ ముగ్గురూ లక్కీ డైరక్టర్లు

బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరక్టర్లకు సినిమాలు దొరకడం కష్టంగా వుంది. అలాంటిది యావరేజ్ సినిమాలో, ఫ్లాపు సినిమాలో ఇచ్చిన డైరక్టర్లకు, ట్రాక్ రికార్డ్ సరిగ్గా లేని డైరక్టర్లకు వరుసగా సినిమాలు రావడం అంటే అదృష్టం పుష్కలంగా వుందనే అనుకోవాలి. 

కెరీర్ లో సరైన హిట్ డెలవర్ చేయని శ్రీరామ్ ఆదిత్య కు ఇప్పుడు మాంచి సినిమా ఎక్కేసింది. ఫుల్ గా సౌండ్ పార్టీ అయిన గల్లా ఫ్యామిలీ హీరోతో సినిమా స్టార్ట్ అయిపోయింది.

తొలి సినిమా తరవాత సరైన హిట్ దొరక్క స్ట్రగుల్ అవుతున్న హను రాఘవపూడికి కూడా చాన్స్ దొరికేలా వుంది. విక్టరీ వెంకటేష్ తో 'అసురన్' రీమేక్ చేయడానికి ఫైనల్ లిస్ట్ లోకి హను పేరే చేరిందని తెలుస్తోంది. వేరే వేరే యంగ్ డైరక్టర్ల పేర్లను పరిశీలించినా, ఆఖరికి హను ఫేరు దగ్గరే ఆగారని బోగట్టా.

హను మాదిరిగానే తొలి సినిమా తరువాత హిట్ రాని సుధీర్ వర్మకు కూడా సినిమా దొరికే చాన్స్ కనిపిస్తోంది. నితిన్ హీరోగా స్వంత బ్యానర్ మీద నిర్మించే అంథాదూన్ రీమేక్ కు సుధీర్ వర్మ పేరే వినిపిస్తోంది. ఆ సబ్జెక్ట్ కు అతనైతే న్యాయం చేస్తారని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

హను, సుధీర్ లకు టేకింగ్ టాలెంట్ వుందని, సరైన స్క్రిప్ట్ లు వాళ్ల చేతిలో పెడితే బాగానే చేస్తారని, అందువల్లే రీమేక్ సబ్జెక్ట్ లు కనుక వాళ్లకు కేక్ వాక్ అవుతుందని అనుకుంటున్నారట ఆయా సినిమాల నిర్మాతలు. ఎలాగైతేనేం సినిమాలు చేతిలోకి రావడం అంటే లక్కీనే కదా ఫుల్ కాంపిటీషన్ వున్న ఈ రోజుల్లో.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?