హీరోయిన్ కు నచ్చని రోల్?

హీరోయిన్ లు అంటే ఎంత గ్లామర్ కోసమే అని అనుకున్నా, వాళ్లు కూడా కాస్త లైనూ, లెంగ్తూ చూసుకుంటారు. తమ పాత్ర కాస్తయినా బాగుండాలి, కెరీర్ కు ఉపయోగపడాలి అని అనుకుంటారు. నభానటేష్ కూడా…

హీరోయిన్ లు అంటే ఎంత గ్లామర్ కోసమే అని అనుకున్నా, వాళ్లు కూడా కాస్త లైనూ, లెంగ్తూ చూసుకుంటారు. తమ పాత్ర కాస్తయినా బాగుండాలి, కెరీర్ కు ఉపయోగపడాలి అని అనుకుంటారు. నభానటేష్ కూడా అలాగే అనుకుంది. అందుకే సినిమా వద్దనుకుంది.

విషయం ఏమిటంటే, బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ (రభస, హైపర్) డైరక్షన్ లో ఓ సినిమా ఓకె అయింది. ఆ సినిమాకు హీరోయిన్ కావాలి. నభానటేష్ ను ఓకె అనుకుని, ఆమెకు సంతోష్ శ్రీనివాస్ కథ చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తన రోల్ మరికొంచెం పెంచితే బాగుంటుందని నభా కోరినట్లు తెలుస్తోంది.

కానీ దానికి డైరక్టర్ సంతోష్ శ్రీనివాస్ నో అన్నట్లు, ఆ రోల్ అంతే అని, ఇంక దాన్ని పెంచడం, మార్చడం వంటివి వీలుకాదని అన్నట్లు తెలుస్తోంది. దాంతో నభా నటేష్ ఆ సినిమా చేయడానికి అంతగా ఇష్టపడడం లేదని బోగట్టా. ఏ నిర్ణయమూ ఇంకా చెప్పలేదని తెలుస్తోంది.  దాంతో మరో హీరోయిన్ కోసం వెదుకులాట మొదలయిందని తెలుస్తోంది.