తిరిగి తిరిగి ఆ హీరో దగ్గరకు

సినిమా హిట్ అనిపించుకుంటే సరిపోదు. ఇండస్ట్రీ జనాలను కూడా ఒప్పించగలగాలి. వారిలో నమ్మకం పెంచగలగాలి. లేదూ అంటే తరువాత సినిమా రావడం కష్టం అవుతుంది. రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్ నక్కిన త్రినాధరావుకు…

సినిమా హిట్ అనిపించుకుంటే సరిపోదు. ఇండస్ట్రీ జనాలను కూడా ఒప్పించగలగాలి. వారిలో నమ్మకం పెంచగలగాలి. లేదూ అంటే తరువాత సినిమా రావడం కష్టం అవుతుంది. రెండు హిట్ లు ఇచ్చిన డైరక్టర్ నక్కిన త్రినాధరావుకు ఇదే సమస్య. ఏ హీరో దగ్గరా కథ ఓకె కావడం లేదని టాక్. నానితో హిట్ కొట్టిన తరువాత హీరో వెంకటేష్ దగ్గర స్టార్ట్ అయింది జర్నీ.

అక్కడ ఎంతకీ కథ ఓకె కాలేదు. ఆ ప్రాజెక్టు అలా వుంది. బెల్లంకొండ శ్రీనివాస్ కు కథ చెప్పారు ఓకె కాలేదు. ఇలా చాలా మంది అయిపోయారు. ఆఖరికి ఇప్పుడు హవీష్ దగ్గరకు వచ్చి ఆగింది వ్యవహారం. రాజ్ తరుణ్ దగ్గర మొదలై, నాని రేంజ్ హీరో దగ్గరకు వెళ్లి, ఇప్పుడు హవీష్ దగ్గరకు వచ్చేయడం అంటే టైమ్ బ్యాడ్ అనుకోవాలా? చెబుతున్న కథల్లో విషయం లేదనుకోవాలా?

హవీష్ దగ్గర కూడా ఇంకా కథ ఓకె కాలేదు. డిస్కషన్ లే నడుస్తున్నాయి. నక్కిన త్రినాధరావు సినిమా చేద్దాం అంటే హవీష్ కూడా ఇంకా కథ, డిస్కషన్లు అంటున్నారు అంటే ఇంకేం అనుకోవాలి. ఇప్పటికైనా నక్కిన త్రినాధరావు బలమైన కథ తయారు చేసుకుంటే బెటర్. హీరోలే ముందుకు వస్తారు తాము రెడీ అంటూ.

విజయ్ కు మాత్రమే సరిపోయే కథ ఇది