Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ డ్రెస్ ల ఖర్చు జోరు

టాలీవుడ్ డ్రెస్ ల ఖర్చు జోరు

టాలీవుడ్ లో రాను రాను హీరోలకు, హీరోయిన్లకు కాస్ట్యూమ్ ల ఖర్చు కాస్త జోరుగానే వుంటోంది. హీరోలు బ్రాండ్ ల మీద, హీరోయిన్లు డిజైనర్ల మీద మక్కువ చూపిస్తుండడంతో ఖర్చు తప్పడం లేదు. సినిమాకు హీరో, హీరోయిన్ల డ్రెస్ లకే దాదాపు నలభై లక్షల వరకు ఖర్చుచేయాల్సి వస్తోంది. ఇందులో సింహభాగం హీరోలదే. అంటే పాతిక లక్షల వరకు. ఈ విషయంలో చిన్న హీరో పెద్ద హీరో అన్న తేడా లేదు.

నాగశౌర్య లాంటి చిన్న హీరో కూడా డ్రెస్ ల విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటాడు. సినిమా ఒకె చేసుకున్నపుడే పాతికలక్షల మేరకు డ్రెస్ లకు కేటాయించాలని క్లియర్ గా చెప్పేస్తాడు. 

సునీల్ కూడా అంతే. కృష్ణాష్టమి, జక్కన్న లకు పాతిక లక్షల వంతున ఖర్చయింది. ఇక సాయిధరమ్ కూడా దాదాపు అంతే దగ్గరగా వున్నారు. కానీ ఈ విషయంలో మహేష్ కొంత బెటర్. మురుగదాస్ సినిమాకు ఇరవై లక్షలే ఖర్చయింది. ఇదే సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్ కు అయిదులక్షలే ఖర్చయింది. కానీ రకుల్ డ్రెస్ లు డిజైన్ చేసిన ముంబాయి డిజైనర్ కు తొమ్మిదిలక్షలు ఫీజుగా ఇవ్వాల్సి వచ్చింది. 

హీరోలు ఎవ్వరూ కూడా మన దేశంలో డ్రెస్ లు కొనకపోవడం విశేషం. ఎక్కువగా బ్యాంకాక్, దుబాయ్, ఇలాంటి దేశాలకు కేవలం డ్రెస్ షాపింగ్ కోసం వెళ్లడం మన హీరోలకు కామన్ అయిపోయింది. మరీ వెళ్లలేని పరిస్థితి వుంటే ఆన్ లైన్ లో డిజైన్లు, కంపెనీలు చూసి డిసైడ్ చేసి, ఎవర్నయినా పంపిస్తున్నారు.

మొత్తం మీద హీరో, హీరోయిన్లు, ఇతర కీలక నటుల డ్రెస్ ల ఖర్చుతో పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమా ఒకటి లాగించేయవచ్చేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?