Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ పరువుపోతోంది

టాలీవుడ్ పరువుపోతోంది

టాలీవుడ్ లో ఓ హెల్దీ వాతావరణం వుంది. వుంటోంది..వుండేది. ఎన్టీఆర్-ఎఎన్నార్-కృష్ణ దగ్గర నుంచి పవర్ స్టార్-మహేష్ బాబు వరకు ఇలాగే వుంటూ వస్తోంది. కానీ ఇటీవల సోషల్ మీడియా ప్రభావం, ప్రచారం పెరిగిపోయిన తరువాత మాత్రం ఈ వాతావరణం అంతా చెడిపోతోంది. ముఖ్యంగా ఫ్యాన్స్ పుణ్యమా అని హీరోల మధ్య నిప్పు రాజుకుంటోంది. ఫ్యాన్స్ లో ముఖ్యంగా ట్విటర్, ఫేస్ బుక్ లాంటివి వాడేవాళ్లు చేస్తున్న హడావుడి ఇంతా అంతా కాదు.

వాస్తవానికి ఇంతో అంతో చదువుకున్నవారే సోషల్ మీడియాలో చురుగ్గా వుంటారు. కానీ వీళ్లలో చాలా మంది వాడుతున్న భాష మాత్రం పరమ నీచంగా వుంటోంది. ఎవరి ఫ్యాన్స్ అయినా కావచ్చు, ఎవరికి మద్దతుగా అయినా కావచ్చు సరైన, సహేతుక విమర్శ అయితే బాగానే వుంటుంది. కానీ అలా వుండడం లేదు.

అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరు సినిమాల విషయంలో నిర్మాతలది కూడా తప్పు వుంది. అసలు అక్కర్లేని కార్డ్ లు, కలెక్షన్లు వదిలి ఫ్యాన్స్ ను ఎందుకు రెచ్చ గొట్టాలి. సినిమాలు హిట్ అయ్యాయి. అందరికి ఇబ్బడి ముబ్బడిగా లాభాలు వస్తాయి. హ్యాపీ కదా? ఇంకెందుకు సంక్రాంతివిన్నర్ అని ఒకరు. బ్లాక్ బస్టర్ గా బాప్ అని ఇంకొకరు. నాన్ బాహుబలి మాదే అని ఇద్దరూ, ఇలా హడావుడి చేయడంతో వాటికి మద్దతుగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రంగంలోకి దిగిపోయారు. 

రకరకాల హ్యాష్ ట్యాగ్ లు పెట్టి, వేలాది ట్వీట్ లు డంప్ చేస్తున్నారు. ఇది ఇవ్వాళే కాదు గతంలోనూ జరిగింది. ఆఖరికి ఇలా చేస్తున్న కొందరు ఆడవాళ్లని, చిన్నపిల్లల్ని కూడా వదలడం లేదు. కొన్నాళ్ల క్రితం ఓ హీరో కుమార్తె పేరిట కూడా హ్యాష్ టాగ్ పెట్టి, నానా అసభ్యమైన ట్వీట్ లు వేసారు. అలాగే హీరోల భార్యలను కూడా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారు.

నిజానికి ఇవన్నీ చాలా వరకు ఫేక్ అక్కౌంట్లు. ఫ్యాన్స్ కు మద్దతుగా కొందరు హీరోల సోషల్ మీడియా వింగ్ లు కూడా రంగంలోకి దిగుతున్నాయని, ఇది వాటి పని కూడా అని వదంతులు వున్నాయి. ఎవరు చేసినా తప్పు తప్పే.

టాలీవుడ్ లో ఓ సహృదయ వాతావరణం ఏర్పాటు కావాల్సిన అవసరం వుంది. అందుకు నిర్మాతల సిండికేట్ మాదిరిగానే హీరోలు కూడా సమావేశమై, తమ తమ ఫ్యాన్స్ ను కట్టడి చేయాల్సి వుంది. ఇవ్వాళ ఓ హీరో పెళ్లా, పిల్లలు కావచ్చు, రేపు మరో హీరో పెళ్లాం పిల్లలు కావచ్చు. ఇలా అసభ్య దూషణకు టార్గెట్ కాకూడదు. దానికి ఈ సంక్రాంతి సీజన్ వ్యవహారాల నేపథ్యమే పునాది కావాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?