Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ తెలివైన ఎత్తుగడ?

టాలీవుడ్ తెలివైన ఎత్తుగడ?

సాధారణంగా ఏదైనా విపత్తు వచ్చినపుడు స్పందించడం అన్నది టాలీవుడ్ కు అలవాటు. అలా స్పందించి, సిఎమ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వడం కూడా అలవాటే. కరోనా కల్లోలం విషయంలో కూడా టాలీవుడ్ ముందుగా అలాగే స్పందించింది. పలువురు హీరోలు కొందరు నిర్మాతలు చకచకా ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయనిధులకు విరాళాలు ప్రకటించారు. 

తెలుగుదేశం పార్టీకి కీలక మద్దతుదారు అని లేదా, ఆ పార్టీకి సింపథైజర్ అని, లేదా ఆ పార్టీతో అనుబంధం వుందని అందరూ అనుకునే ఓ టాలీవుడ్ ఫ్యామిలీ దగ్గర ఓ మెలికపడింది. ఆ మెలిక ఎలాంటిది అంటే, ఎవ్వరూ కాదనలేనిది తప్పు పట్టలేనిది. సరికాదు అని అనలేనిది. 

సిఎమ్ ల ఫండ్ కు ఇవ్వకుండా తామే ఓ రిలీఫ్ ఫండ్ లాంటిది ప్రారంభించి, తామే దాన్ని ఖర్చు చేసేలా ప్లాన్ చేసారు. దానికి సిసిసి అని నామకరణం చేసి, మెగా ఫ్యామిలీకి పగ్గాలు అప్పగిస్తూనే,  ఆ కమిటీని తన మాట వినే జనాలతో నింపేసారని ఇండస్ట్రీలో గుసగుుసలు వినిపిస్తున్నాయి. దాంతో అప్పటివరకు సిఎమ్ ఫండ్ కు వెళ్లిన విరాళాలు మినహా మిగిలినవన్నీ ఈదారి పట్టేసాయి.

పోనీ మంచిదే, టాలీవుడ్ జనాలకు ఎవరు సాయం చేస్తారు. వాళ్లలో వాళ్లే చేసుకోవాలి అని అనుకోవడం వరకు సబబే. అయితే ఇక్కడ మరో ఎత్తుగడ ప్రారంభమైందని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది. థియేటర్ల స్టాఫ్ కూడా టాలీవుడ్ లో భాగమే కనుక, వాళ్లను కూడా అందులో చేర్చాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అలా చేస్తే పెద్ద సంఖ్యలో థియేటర్లు గ్రౌండ్ లీజ్ తీసుకున్నవారికి కాస్త ఊరట కలుగుతుంది. వారంతట వారు నేరుగా ఇక సాయం చేయనక్కరలేదు.

తెలంగాణలో పెద్ద సంఖ్యలో థియేటర్లు చేతిలో వున్న సంస్థ నుంచి సిసిసి కి కానీ, సిఎమ్ ఫండ్ కు కానీ రూపాయి విరాళం రాలేదు. అలాగే ఆంధ్రలొ థియేటర్లు వున్న మరో సంస్థ ఇప్పటి వరకు రూపాయి విరాళం ఎవరికీ ప్రకటించలేదు. 

నిజానికి తెలంగాణలో పెద్ద ఎత్తున థియేటర్లు వున్న సంస్థ అధినేత పూర్తి జీతాలు ఈ నెల చెల్లించేద్దామని అంటే, అందులో భాగస్వామిగా వున్న టాలీవుడ్ కీలక వ్యక్తి అడ్డం పడినట్లు వినిపిస్తోంది.  సగం జీతాలు చెల్లిద్దామని, కావాలంటే సిసిసి నుంచి కొంత సరుకులు అందించే ప్రయత్నం చేద్దామని అన్నట్లు తెలుస్తోంది.

జగన్ కు నివేదిక

టాలీవుడ్ లో జరుగుతున్న రాజకీయాలు, వ్యవహారాలు వీటన్నింటిపై వైకాపాతో సంబంధాలు వున్న కొందరు ఇప్పటికే సిఎమ్ జగన్ కు ఓ నివేదిక అందించినట్లు వినిపిస్తోంది. షో లు పెంచుకోవడం, రేట్లు పెంచుకోవడం, టాక్స్ లు ఎగ్గొట్టడం వంటి వ్యవహారాలపై ఇక నైనా ఆంధ్ర ప్రభుత్వం గట్టి దృష్టి పెట్టాలని ఆ వర్గాలు సిఎమ్ జగన్ కు విన్నవించినట్లు తెలుస్తోంది. 

ఇదే కనుక చంద్రబాబు ప్రభుత్వం వుండి వుంటే టాలీవుడ్ లోని ఓ వర్గం పెద్దల ఆలోచనలు వేరుగా సాగి వుండేవని వైకాపా అనుకూల జనాలు అంటున్నారు. అసలే కొత్త రాష్ట్రం, ఆర్థిక ఇబ్బందుల్లో వుంది. మనం ఆదుకోవాలి ఇలాంటి సుద్దులు చెప్పి, ఫండ్స్ అంటు పంపి వుండేవారని కామెంట్ చేస్తున్నారు. 

మొత్తం మీద కరోనా కల్లోలం చల్లారిన తరువాత సిఎమ్ జగన్ కచ్చితంగా టాలీవుడ్ వ్యవహారాల మీద దృష్టి పెడతారని, అలా పెట్టాలని తాము కోరతామని, ఆన్ లైన్ టికెటింగ్ వ్యవస్థ ను తయారుచేయడం, రేట్లు ఇష్టానుసారం పెంచకుండా లీగల్ గా కట్టడి చేయడం, థియేటర్లకు అదనపు ఆటల విషయంలో ఓ విధానం తయారు చేయడం వంటివి జరుగుతాయని అంటున్నారు. 

మొత్తానికి కరోనా వచ్చి టాలీవుడ్ వ్యవహారాలను కూడా కదుపుతున్నట్లు కనిపిస్తోంది.

క‌రొనా పై చిరు-నాగ్ పాట చూశారా?

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?