గుత్తా జ్వాలాలో విర‌హ వేద‌న‌

క‌రోనా వైర‌స్ కొంద‌రికి విర‌హ వేద‌నను క‌లిగిస్తోంది. త‌మ బాధ‌ను బ‌య‌ట‌కు చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కానీ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాడ్మింగ‌న్ క్రీడాకారిణిగా పేరుగాంచిన గుత్తా జ్వాలా మాత్రం త‌న విర‌హ వేద‌న‌ను ప‌రోక్షంగా…

క‌రోనా వైర‌స్ కొంద‌రికి విర‌హ వేద‌నను క‌లిగిస్తోంది. త‌మ బాధ‌ను బ‌య‌ట‌కు చెప్పుకోలేక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. కానీ డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాడ్మింగ‌న్ క్రీడాకారిణిగా పేరుగాంచిన గుత్తా జ్వాలా మాత్రం త‌న విర‌హ వేద‌న‌ను ప‌రోక్షంగా బ‌య‌ట పెట్టారు. దీనికి ఆమె ట్విట‌ర్‌ను వేదిక‌గా ఎంచుకున్నారు.

కొంత కాలంగా త‌మిళ న‌టుడు విష్ణువిశాల్‌, గుత్తా జ్వాలా డేటింగ్‌లో ఉన్న విష‌యం తెలిసిందే. త‌ర‌చూ వాళ్లిద్ద‌రూ క‌లుసుకుంటూ సోష‌ల్ మీడియాలో ఫొటోల‌ను షేర్ చేసేవాళ్లు. అయితే దేశంలో క‌రోనా క‌ట్ట‌డికి ప్ర‌ధాని మోడీ లాక్‌డౌన్‌కు పిలుపునివ్వ‌డం…ప్ర‌జ‌లంతా దాన్ని పాటిస్తున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో  క్రీడాకారిణి గుత్తా జ్వాలా హైదరాబాద్‌లోనూ, ఆమె ప్రియుడు విష్ణువిశాల్ చెన్నైలో ఉండిపోవాల్సి వ‌చ్చింది. దీంతో దిక్కుతోచ‌ని గుత్తా త‌న‌దైన శైలిలో ట్వీట్ చేశారు.  

‘నా బూను మిస్ అవుతున్నాను’  అంటూ గుత్తా జ్వాలా విర‌హ వేద‌న ఉట్టి ప‌డేలా ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన   విష్ణువిశాల్ ….. దీనికి ఓకే, ఇప్పుడు సామాజిక దూరం పాటించడం ముఖ్యం’ అంటూ ఓ ఓదార్పు ట్వీట్‌తో గుత్తాలో ఎగిసిప‌డుతున్న ‘ప్రేమ జ్వాల‌’ను శాంత‌ప‌రిచే య‌త్నం చేశారు. 

ఏప్రిల్ 7వ తేదీకి కేసులన్నీ ఖతం