రూటు మారుస్తున్న త్రివిక్రమ్‌!

త్రివిక్రమ్‌ కొంత కాలంగా స్టార్‌ హీరోల సినిమాలకే పరిమితమయ్యాడు. ఒక్క 'అఆ' మినహాయిస్తే 'అతడు' నుంచి 'అజ్ఞాతవాసి' వరకు అన్నిట్లోను స్టార్‌ హీరోలే చేసారు. Advertisement పెద్ద స్టార్లతో చేసేటపుడు వారి ఇమేజ్‌కి కట్టుబడి…

త్రివిక్రమ్‌ కొంత కాలంగా స్టార్‌ హీరోల సినిమాలకే పరిమితమయ్యాడు. ఒక్క 'అఆ' మినహాయిస్తే 'అతడు' నుంచి 'అజ్ఞాతవాసి' వరకు అన్నిట్లోను స్టార్‌ హీరోలే చేసారు.

పెద్ద స్టార్లతో చేసేటపుడు వారి ఇమేజ్‌కి కట్టుబడి కమర్షియల్‌ అంశాలతో కథలు చెప్పాల్సి వుంటుంది. దీని వల్ల రైటర్‌గా అత్యుత్తమ చిత్రాలు అందించిన త్రివిక్రమ్‌ ఇటీవల తన స్థాయికి తగ్గ స్క్రిప్టులు సిద్ధం చేయలేకపోతున్నాడు.

తన తదుపరి చిత్రం కూడా పెద్ద స్టార్‌ అయిన ఎన్టీఆర్‌తోనే చేస్తోన్న త్రివిక్రమ్‌ అటు తర్వాత చేయబోయే చిత్రాలు మాత్రం యువ హీరోలతో చేయాలనుకుంటున్నాడట. 

ఇమేజ్‌ భారం లేని హీరోలతో అయితే రచయితగా తనకి పూర్తి స్వేఛ్ఛ వుంటుందని, హీరోల ఇమేజ్‌కి తగ్గట్టు కథ రాయాలంటే తనకి తాను కంచె వేసుకోవాల్సి వస్తోందని త్రివిక్రమ్‌ సన్నిహితులతో చెప్పాడట.

యువ హీరోల్లో ఎవరైనా తన దర్శకత్వంలో చేసేందుకు సిద్ధంగా వుంటారు. త్రివిక్రమ్‌ దృష్టిలో అయితే నాని వున్నాడని, అతనితో ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని తీర్చిదిద్దాలని భావిస్తున్నాడని సమాచారం. అయితే ప్రస్తుతం ఇద్దరికీ వున్న కమిట్‌మెంట్ల వల్ల ఈ చిత్రం ఎప్పుడు సెట్స్‌ మీదకి వెళుతుందనేది చెప్పడం కష్టం.