అన్నీ అనుకున్నట్టు జరిగితే మార్చి 12నుంచి వెంకటేశ్, తేజ కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వస్తుంది. అప్పటికి కొత్త నటీనటులతో వర్క్ షాప్ పూర్తిచేస్తానని తేజ హామీ ఇచ్చాడట. ఈ సినిమాలో ఇప్పటికే శ్రియను హీరోయిన్ గా ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు సెకెండ్ హీరోయిన్ వేటలో ఉంది యూనిట్. ఇందులో భాగంగా ఇషా రెబ్బాను సెలక్ట్ చేసే ప్లాన్స్ లో ఉన్నారు.
రీసెంట్ గా అ! సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది ఇషా. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినప్పటికీ.. ఇందులో ఆమె లుక్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఆమెను తీసుకోవాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి.
వెంకీ లాంటి సీనియర్ సరసన నటిస్తే కుర్రహీరోలు పట్టించుకోరేమో అనే భయంతో ఉంది ఇషా. ఆ ఒక్క అనుమానం తీరిపోతే అంతా ఓకే అయిపోయినట్టే. నిజానికి ఇది సెకెండ్ హీరోయిన్ పాత్ర కాదట. సినిమాలో ఓ 10నిమిషాల పాటు కనిపించే ప్రత్యేక పాత్ర అని తెలుస్తోంది. కాబట్టి ఇషా ఇందులో నటిస్తే తనకు ఎలాంటి ఇబ్బంది ఉండదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది యూనిట్.
ఈ సినిమాకు ఆటనాదే-వేట నాదే అనే టైటిల్ అనుకుంటున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై రాబోతున్న ఈ సినిమాకు ఇప్పటికే పాటలిచ్చే పని మొదలుపెట్టాడు అనూప్.