Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ కు హీరోలు కష్టమా?

త్రివిక్రమ్ కు హీరోలు కష్టమా?

టాప్ డైరక్టర్ త్రివిక్రమ్ తరువాత సినిమా సూపర్ స్టార్ మహేష్ తో ప్లానింగ్ లో వుంది. అల వైకుంఠపురములో విడుదల తరువాత రెండేళ్లకు పైగా ఖాళీగా వున్నారు త్రివిక్రమ్. అలా అని ఆదాయానికి సమస్యేం లేదు. 

భీమ్లా నాయక్ కు కర్త..కర్మ..క్రియ ఆయనే. ఆ తరువాత సాయితేజ్-పవన్ కళ్యాణ్ సినిమాకు స్క్రిప్ట్, వైష్టవ్ తేజ్-పవన్ కళ్యాణ్ సినిమాకు కథ లాంటి పనుల వుండనే వున్నాయి.

కానీ మహేష్ తరువాత త్రివిక్రమ్ డైరక్ట్ చేయడానికి హీరో ఎవరు అన్నది క్వశ్చను. ఎన్టీఆర్, ప్రభాస్, పవన్, చిరంజీవి, ఇలా వీళ్లెవ్వరి డైరక్టర్ల జాబితాల్లో త్రివిక్రమ్ పేరు వినిపించడం లేదు. బన్నీ ఇంకా పుష్ప 2 స్టార్ట్ చేసి ఫినిష్ చేయాలి. ఆ టైమ్ కు త్రివిక్రమ్ కూడా మహేష్ సినిమా నుంచి ఫ్రీ అవుతారు. కానీ అది కాదు సమస్య.

పుష్ప2 పెద్ద సక్సెస్ అయిన తరువాత బన్నీ పాన్ ఇండియా సినిమా కోసమే చూస్తారు. డైరక్టర్ నేమ్ యాడ్ కావాలని అనుకుంటారు. అప్పుడు త్రివిక్రమ్ కు ఛాయిస్ వుంటుందా అన్నది అనుమానం. 

రామ్ చరణ్ తో చేయాలని త్రివిక్రమ్ కు ఎప్పటి నుంచో ఆసక్తి వుంది. కానీ అతను ఎంత వరకు రెస్పాండ్ అవుతాడు అన్నది కూడా అనుమానమే. పైగా ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కు చెడిందని టాక్ వుంది. అలాంటపుడు ఎన్టీఆర్ నేస్తం చరణ్ మాత్రం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతాడా? అదీ అనుమానమే. 

ఇక అప్పుడు వెంకటేష్ లాంటి సీనియర్ మాత్రమే మిగులుతారేమో త్రివిక్రమ్ కు?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?