ఎన్టీఆర్-త్రివిక్రమ్ అరవింద సమేత సినిమా చకచకా ముస్తాబైపోతోంది. అక్టోబర్ లో విడుదల పక్కా. తరువాత ఏంటీ అన్నది పాయింట్. కానీ టాప్ హీరోలు అంతా ఆల్ మోస్ట్ లాక్ అయిపోయారు. ఎన్టీఆర్-చరణ్ ను రాజమౌళి లాక్ చేసాడు. పవన్ పాలిటిక్స్ లోకి వెళ్లిపోయారు. మహేష్ వంశీ పైడిపల్లి, సుకుమార్ తో బుక్ అయిపోయారు. ప్రభాస్ ను 2020 వరకు మరిచిపోవచ్చు. ఇంక మిగిలింది బన్నీ మాత్రమే.
పోనీ, అ..ఆ మాదిరిగా ఓ డిఫరెంట్ సినిమా నాని లాంటి హీరోతో చేద్దామంటే గత అనుభవం భయపెడుతోంది. అ..ఆ సినిమా అతి కష్టంమీద బ్రేక్ ఈవెన్ అయ్యింది. అది కూడా డైరక్టర్, హీరో రెమ్యూనిరేషన్ తగ్గించుకుంటే. ఇప్పడు నడుస్తున్న సీజన్ అంతా వందకోట్ల సినిమాది. త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ కు 15 నుంచి 20కోట్ల రెమ్యూనిరేషన్ ఇచ్చి, నాని లాంటి మీడియం హీరోతో ఎవరు సిన్మా ప్లాన్ చేస్తారు.
అందుకే ఇక మిగిలిన ఏకైక ఆప్షన్ అల్లుఅర్జున్ మాత్రమే. బన్నీ సినిమా అయితే కచ్చితంగా వందకోట్ల రేంజ్ లో మార్కెట్ చేయవచ్చు. అందుకే ఎన్టీఆర్ తరువాత సినిమా బన్నీతోనే అన్నది దాదాపు ఫిక్స్ అనుకోవాలి. పైగా హారిక హాసినికి కూడా వందకోట్ల సినిమాలే కావాలి. కానీ విక్రమ్ కుమార్ సినిమా పూర్తయ్యే దాకా త్రివిక్రమ్ ఆగాల్సి వుంటుందేమో/ అంటే కనీసం ఆరేడునెలలు.
ఇదిలా వుంటే మరి ఇంతకీ వెంకీతో హారిక హాసిని ప్రకటించిన సినిమా సంగతేమిటో?