Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్-ఎన్టీఆర్...కాంబినేషన్ కలేనా?

త్రివిక్రమ్-ఎన్టీఆర్...కాంబినేషన్ కలేనా?

కొన్ని కొన్ని కాంబినేషన్ లు చాలా ఆసక్తిగా వుంటాయి కానీ, ఎందుకో అంత త్వరగా సెట్ కావు. అలాంటివాటిలో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ ఒకటి. మరి ఎక్కడ సమస్యో కానీ, ఈ కాంబినేషన్ మాత్రం సెట్ కావడం లేదు. గతంలో ఒకసారి ఈ కాంబినేషన్ సెట్ అయ్యేదే..చివరి నిమిషంలో ఆగిపోయింది. హారిక హాసిని పతాకంపై అ..ఆ కు ముందు ఓసారి ప్రయత్నం జరిగింది. హారిక హాసిని అధినేత చినబాబు స్వయంగా ఎన్టీఆర్ దగ్గరకు వెళ్లారు. త్రివిక్రమ్

రెండు సార్లు వెళ్లారు. మరి ఏమయిందో ఆ తరువాత మరి ముందకు సాగలేదు. కట్ చేస్తే, ఇప్పుడు త్రివిక్రమ్-ఎన్టీఆర్ ను కలపాలని కొన్ని ప్రయత్నాలు సాగుతున్నాయి. ఓ నిర్మాత పట్టువదలని విక్రమార్కుడిలా త్రివిక్రమ్ దగ్గరకు ఈ కాంబినేషన్ కోసం తెగ వెళ్లి వస్తున్నారు. 

త్రివిక్రమ్ ఎస్ చెప్పడం లేదు నో చెప్పడం లేదు. మరోపక్క జనతా గ్యారేజ్ హిట్ తరువాత ఎన్టీఆర్ స్వయంగా త్రివిక్రమ్ ను సినిమా చెద్దామని అడిగారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. డిప్లమాటిక్ ఆన్సర్ మాత్రమే త్రివిక్రమ్ నుంచి వచ్చింది కానీ, పక్కా ఎస్ అన్న సమాధానం రాలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ కు చెప్పడానికి ఓ సాకు అయితే వుంది. అదే..పవన్ తో చేయాల్సిన సినిమా. కానీ అది ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. 

ఆ సినిమా వున్నా కూడా, తరువాతి సినిమాగా కమిట్ కావచ్చు త్రివిక్రమ్ అనుకుంటే కనుక. కానీ అలా కమిట్ కావడం లేదు అంటే..సమ్ థింగ్ రాంగ్..ఇన్ బిట్వీన్ అనుకోవాలేమో?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?