వెంకటేష్ హీరోగా 'గురు' (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనుంది. బాలీవుడ్లో వచ్చిన 'సాలా ఖదూస్' సినిమాకి ఇది తెలుగు రీమేక్. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. మాధవన్ హీరోగా నటించిన చిత్రమిది. ఇందులో మాధవన్ బాక్సింగ్ కోచ్‌లా కనిపిస్తాడు. మాధవన్ దగ్గర బాక్సింగ్‌లో శిక్షణ తీసుకుని, ఛాంపియన్‌గా ఎదిగే పాత్రలో రితికా సింగ్ నటించింది.
మాధవన్ గురించి కొత్తగా చెప్పేదేముంది.? పాత్ర కోసం తనను తాను ఎలాగైనా మార్చేసుకుంటాడు. జుట్టు పెంచేశాడు, పిజిక్ని పెంచేశాడు.. బాక్సింగ్‌లో అంతకు ముందే అతనికి కాస్తో కూస్తో ప్రావీణ్యం వుండడంతో ఇంకాస్త ప్రాక్టీస్ చేసి, నిజమైన కోచ్ అన్పించేసుకున్నాడు. వెంకీ కూడా ఇప్పుడు బాక్సింగ్ కసరత్తులు షురూ చేశాడు. ఈ వయసులో బాక్సింగ్ ప్రాక్టీస్ కాస్త కష్టమేమో.. అన్న ఆలోచన ముందు వచ్చినా, వెంకీ కాస్త మొండిగానే బాక్సింగ్‌లో కసరత్తులు చేపట్టాడట.
మరోపక్క, ముందుగా ఈ సినిమాకి సిక్స్ ప్యాక్ తరహాలో ఫిజిక్‌ని మలచుకోవాలనుకున్న వెంకటేష్, ట్రైనర్ల సూచనతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. ప్రస్తుతం వున్న ఫిజిక్‌నే ఇంకా ఫిట్‌గా మార్చుకునేందుకు శ్రమిస్తున్నాడు. వెంకీ కష్టం చూస్తే ఎవరైనా 'హేట్సాఫ్' అనాల్సిందేనని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. 'సాలా ఖదూస్'లో నటించిన రితికా సింగ్, తెలుగు వెర్షన్లోనూ నటిస్తోంది. బాలీవుడ్‌తో పోల్చితే, తెలుగుకొచ్చేసరికి అదనంగా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించనున్నారట.