టాలీవుడ్ జనాలను ఆలోచింపచేస్తున్న ప్రశ్న ఇది. త్రివిక్రమ్ ఇంతవరకు మెగా టాప్ హీరో ముగ్గురిలో ఇద్దరితోనే రిపీటెడ్ గా సినిమాలు చేసారు. రామ్ చరణ్ తో మాత్రం చేయలేదు. మహేష్ తో మూడో సినిమాకు రెడీ అయిపోతున్నారు. అలాగే ఎన్టీఆర్ తో ఇంతవరకు చేయలేదు.
తివిక్రమ్ లెవెల్ కు ఇంక చేయని హీరోలు ఎవరు లేరు. బాలయ్య నరుకుడు సినిమాలకు తివిక్రమ్ సూట్ కారు. మరి రామ్ చరణ్, ఎన్టీఆర్ లను ఎందుకు వదిలేసినట్లు? వారు అడగలేదు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే హిట్ కావాలనే వుంటుంది ఏ హీరోకైనా. నేరుగా అడగకపోయినా, ఏదో విధంగా కబురు చేసే వుంటారు.
కానీ తివిక్రమ్ ఎందుకు టర్న్ కావడం లేదు? పోనీ ఎన్టీఆర్ కు సరిపడా కథ లేదనుకున్నా, రామ్ చరణ్ దేనికైనా రెడీ కదా? కృష్ణవంశీతో కలిసి ఫ్యామిలీ డ్రామా చేసాడు కూడా.
టాలీవుడ్ జనాలు అనుకోవడం ఏమిటంటే, తివిక్రమ్ తన పనిలో వేరేవాళ్లు వేలు పెడితే అంగీకరించలేడు. ఆయన ఐడియాలజీ, ఆయనదే. ఎన్టీఆర్, రామ్ చరణ్ దగ్గర ఇది సాగదు. రామ్ చరణ్ సినిమాలకు చిరంజీవి మాగ్జిమమ్ సూపర్ విజన్ బాధ్యతలు తీసుకుంటారు. పరుచూరి బ్రదర్స్ లాంటి వాళ్లను తీసుకొచ్చి, దర్శకుడి పై కూర్చోపెడతారు. ఇక ఎన్టీఆర్ సినిమా కథల్లో కాస్త ఎక్కువగానే జోక్యం చేసుకుంటారని గుసగుసలు వున్నాయి. బహుశా అందుకనే తివిక్రమ్ ఆ ఇద్దరి వైపునకు వెళ్లడం లేదేమో?