Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

త్రివిక్రమ్ వెంట హీరోలు

త్రివిక్రమ్ వెంట హీరోలు

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ చిన్న సినిమా చేయాలనుకుంటున్నారు అన్న వార్త బయటకు పొక్కగానే కొందరు హీరోలు ఇప్పుడు ఆయన వెంట పడుతున్నారు. ఈ లైన్ లో రామ్, నితిన్, సునీల్ వున్నారని వినికిడి. చిత్రంగా వీరు కూడా అవసరమైతే రెమ్యూనిరేషన్ లేకుండా కూడా చేస్తాం అని ఆఫరిచ్చారని తెలుస్తోంది. 

అయితే  రామ్, నితిన్ లతో పాటు మరో హీరో పేరు కూడా త్రివిక్రమ్ పరిశీలనలో వుందని తెలుస్తోంది. సినిమా కథ దాదాపు సగానికి పైగా హీరోయిన్ కీలకంగా వుంటుందని, అయినా హీరోకి కూడా మంచి విషయమే వుందని వార్తలు వినవస్తున్నాయి. 

త్రివిక్రమ్ లాంటి డైరక్టర్ సినిమాలో చేయాలని హీరోలకు ఆశగా వుంటుంది.అందుకే నితిన్, రామ్ అప్రోచ్ అయి వుంటారు. రామ్ చేతిలో రెండు సినిమాలు వున్నాయి. నితిన్ ప్రస్తుతం ఇంకా ఏ ప్రాజెక్టును స్టార్ట్ చేయలేదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?