తానా సభల్లో ఉచితంగా తెలుగు పుస్తకాలు!

అమెరికాలో హిందూ దేవాలయాలు అనేకం. చికాగో, డల్లాస్, హౌస్టన్, ఓక్లహోమా, లోస్ యాన్జిల్స్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, మెంఫిస్, మియామీ ఇలా అమెరికాలోని ప్రతి పట్టణంలో వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ లక్ష్మి,…

అమెరికాలో హిందూ దేవాలయాలు అనేకం. చికాగో, డల్లాస్, హౌస్టన్, ఓక్లహోమా, లోస్ యాన్జిల్స్, న్యూ యార్క్, న్యూ జెర్సీ, మెంఫిస్, మియామీ ఇలా అమెరికాలోని ప్రతి పట్టణంలో వినాయకుడు, శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ లక్ష్మి, సీతా సహిత శ్రీ రామ లక్ష్మణులు, శివుడు, పార్వతి, షిర్డీ సాయి, నవగ్రహాలు నిత్య పూజలు అందుకుంటూనే వుంటాయి. గుళ్ళు గోపురాలు ఎన్ని వున్నా ఇక్కడ ఆలయాల్లో ఆధ్యాత్మిక సాహిత్యం లభ్యం కాదు. 

శ్రీ రమణ మహర్షి, శ్రీ అరవింద, శ్రీ షిర్డీ సాయి జీవిత కథలు, ధ్యానం-యోగం ఎలా చేయాలి, గురు గీత, గురు దర్శనం, భగవాన్ చరణాలు, ఇహం పరం మనం, ఆత్మ జ్ఞానం, ఆత్మ దీపాలు, అసతోమా సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ ఆత్మయోగం, కర్ణ మహాభారతం,ఆంధ్ర మహాసావిత్రి, శంబల, కుండలిని, సిధార్థ, సద్గురు రమణ, సద్గురు సాయిబాబా, భగవాన్ బుద్ధ, సత్య సంహిత, జిడ్డు కృష్ణమూర్తి, మెహర్ బాబా, భ్రక్త రహిత తారక రాజ యోగం, సంబల, మహాత్మా జీసస్ వంటి వందకు పైగా తెలుగు పుస్తకాలు,  డాక్టర్ దుగ్గిరాల-లివింగ్ ఫర్ జనేరేషన్స్,  ఇన్ సెర్చ్ అఫ్ గాడ్, ఇన్ సెర్చ్ అఫ్ సోల్, ఇన్ సెర్చ్ అఫ్ ఏ గురు, ఇమ్మోర్తల్స్ అఫ్ శంబల, కుండలిని, లవ్ యెన్ యోగ, స్పిరిటుఅల్ జర్నీ అఫ్ జీసస్ క్రిస్ట్, క్రిస్ట్ కాన్షిఎసనుస మొదలైన ఇంగ్లీష్ పుస్తకాలు స్పిరిట్యుఅల్ ఫౌండేషన్ అఫ్ అమెరికా వారి వద్ద లభ్యమవుతాయి. 

ఫౌండేషన్ వ్యవ్ష్టపకులు డాక్టర్ రమణ వాసిలి మరియు శ్రీమతి చంద్ర ప్రభ ఈ ధార్మిక సంస్థని ధనాపేక్షతో కాక అమెరికాలో ఉండే తెలుగు వారికీ మంచి పుస్తకాలు అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పుస్తకాలతో పాటు వాసిలి వసంత కుమార్ వ్యక్తిత్వ వికాసనకు దోహదపడే అత్యంత ప్రముఖ రచనలు, గెలవాలి గెలిపించాలి, సిగ్గుపడితే సక్సస్ రాదు, పెళ్లి మైనస్ పెటాకులు వంటి పుస్తకాలు కూడా లభ్య మవుతాయి. 

జూలై 2 నుండి 4 వరకు మిచిగాన్ రాష్త్రం లోని డిట్రాయిట్ పట్టణంలో జరిగే తానా 2015 సమావేశాల్లో ఆ తర్వాత అట్లాంటా, నాషవిల్లె, జాక్సన్, ఒక్లోహోమ సిటీ, చికాగో, డల్లాస్ వంటి పట్టణాల్లో పుస్తక ప్రదర్సనలు ఉంటాయని డాక్టర్ రమణ చెప్పారు. పుస్తక ప్రియులు, ఆధ్యాత్మిక ఆసక్తి ఉన్న వారు ఫౌండేషన్ వారికి చిన్న విరాళం ఇచ్చి లేదా ఉచితంగా నైన ఏ పుస్తాకాన్నైన తానా 2015 సమావేశాల్లో కానీ లేదా స్పిరిట్యుఅల్ ఫౌండేషన్ని సంప్రదించి కానీ తెప్పించుకోవచ్చు.