Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

తివిక్రమ్-చిరు సినిమా లేనట్లే

తివిక్రమ్-చిరు సినిమా లేనట్లే

టాప్ డైరక్టర్ తివిక్రమ్ ప్లాన్ చేసిన ప్రాజెక్టులు చాలానే వున్నాయి. వాటిలో మహేష్ బాబు, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్ సినిమాలు వార్తల్లో వినిపిస్తూనే వున్నాయి. వీటిలో మహేష్ బాబు సినిమాను లిస్ట్ లోంచి దాదాపు తీసేయవచ్చు. మహేష్-త్రివిక్రమ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే వుండదని అనుకోవచ్చు.

ఇక చిరంజీవి, వెంకటేష్, ఎన్టీఆర్. వీటిల్లో తక్షణం వుండేది ఎన్టీఆర్ సినిమానే అని తెలుస్తోంది. జనవరి నాటికి త్రివిక్రమ్ ఫ్రీ అయిపోతారు. ఆ వేళకు ఎన్టీఆర్ కూడా ఆర్ఆర్ఆర్ నుంచి దాదాపు ఫ్రీ అయిపోతారని తెలుస్తోంది. ఈ ఇద్దరు కలిసి 2020 దసరాకు ఓ సినిమాను అందించే ప్రణాళికలు తయారవుతున్నట్లు తెలుస్తోంది.

జనవరి నాటికి ఇటు వెంకటేష్ కానీ, చిరంజీవి కానీ రెడీగా వుండరు. వాళ్లు ఇద్దరు బిజీగానే వుంటారు. అదీకాక అరవింద సమేత తరువాత ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ నే వేరు. ఆ సినిమా టైమ్ లో ఎన్టీఆర్ కు త్రివిక్రమ్ కు మధ్య బాండింగ్ చాలా బాగా కుదిరింది. అందుకే బన్నీతో సినిమా తరువాత త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లోనే సినిమానే ఫిక్స్ అని విశ్వసనీయ వర్గాల బోగట్టా.

ఇక మెగాస్టార్ చిరంజీవితో త్రివిక్రమ్ సినిమా అన్నది ఆ తరువాత విషయం. వుంటే వుండొచ్చు.. లేకపోతే లేదు. గ్యారంటీ అయితే లేదు అని తెలుస్తోంది.

ఇప్పుడు కాపీ కొడితే అవతల వాళ్లు తేలికగా వదలరు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?