విహార యాత్రకు డబ్బెక్కడిది.. హీరోపై ట్రాలింగ్

పైకి సాఫ్ట్ గా కనిపించినా.. ఆకతాయిల పనిపట్టడంలో అభిషేక్ బచ్చన్ ఎక్కడా వెనకాడడు. మిగతా హీరోల్లాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని చూసీచూడనట్టు వదిలేయడు. ముఖ్యంగా ట్రోలర్స్ కి తనదైన శైలిలో రిప్లై…

పైకి సాఫ్ట్ గా కనిపించినా.. ఆకతాయిల పనిపట్టడంలో అభిషేక్ బచ్చన్ ఎక్కడా వెనకాడడు. మిగతా హీరోల్లాగా సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ని చూసీచూడనట్టు వదిలేయడు. ముఖ్యంగా ట్రోలర్స్ కి తనదైన శైలిలో రిప్లై ఇస్తూ నోరు మూసుకునేలా చేస్తాడు. గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తాజాగా లండన్ వెకేషన్ నుంచి ఫ్యామిలీతో సహా తిరిగొచ్చిన అభిషేక్ ని ట్విట్టర్ లో మరోసారి ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్ మెసేజెస్ అన్నిటికీ తనదైన శైలిలో తిప్పికొట్టాడు అభిషేక్. 

మూడేళ్లుగా సినిమాలు లేకుండా ఖాళీగా ఉన్న మీకు కుటుంబంతో కలసి ఇంత కాస్ట్ లీ ట్రిప్ వెళ్లడానికి డబ్బులెలా వచ్చాయంటూ ఓ పోకిరీ మెసేజ్ పెట్టాడు. “సార్, సినిమాల్లో నటించకపోతేనేం, నాకు ఇతర బిజినెస్ లున్నాయి, సినిమా నిర్మాణం, స్పోర్ట్స్ బిజినెస్ ఇలా చాలానే ఉన్నా”యంటూ దానికి రిప్లై ఇచ్చాడు అభిషేక్. ప్రస్తుతం ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాడు అభేషేక్ బచ్చన్. ఈ సినిమాపై దర్శకుడు అనురాగ్ కశ్యప్ చేసిన ట్వీట్ ని ఒకరు ట్రోల్ చేశారు.

“అంతా బాగానే ఉంది, సినిమాలో అందరూ మంచి నటీనటుల్నే తీసుకున్నారు, మరి అభిషేక్ బచ్చన్ సంగతేంటి, కేవలం స్టార్ అట్రాక్షన్ కోసమే అతడ్ని తీసుకున్నారా అని ప్రశ్నించాడు”. మీరేమైనా కరణ్ జోహార్ సిండ్రోమ్ తో బాధపడుతున్నారా అంటూ కాస్త మసాలా జోడించాడు. దీనికి దర్శకుడు గట్టిగానే సమాధానం చెప్పగా, అభిషేక్ కూడా ఎట్ లీస్ట్ తనను స్టార్ గా గుర్తించాడంటూ కామెంట్ పెట్టాడు. 

దీనికి ఆ వ్యక్తి రిప్లై ఇస్తూ నువ్వు స్టార్ వి కావు, కేవలం స్టార్ కొడుకువి మాత్రమేనంటూ మరోసారి రెట్టించాడు. అభిషేక్ బచ్చన్ కూడా అక్కడితో ఆగలేదు.. నీ టైపింగ్ మిస్టేక్ ని ఈసారికి కన్సిడర్ చేస్తున్నాలే.. అంటూ తను కూడా తమాషాగా రిప్లై ఇచ్చాడు. 

ఇప్పుడే కాదు, గతంలో అభిషేక్ బచ్చన్ కు చాలాసార్లు ఇలా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చిపడేవి. అయితే వీటన్నిటికీ ఓపిగ్గా, కాస్త గట్టిగా సమాధానాలిస్తూ ట్రోలింగ్స్ చేసే వారికి ఎక్కడికక్కడ బ్రేక్ వేసేవాడు అభిషేక్.