కమర్షియల్ సినిమాల్లో శివుడి పాట అనగానే గుర్తుకువచ్చేది ఖలేజా సినిమాలో 'సదా శివా సన్యాసి' రామజోగయ్య రాసిని ఈ పాట ఇప్పటికీ వినిపిస్తూనే వుంటుంది. మళ్లీ అలాంటి పాట రాలేదు. అయితే ఉప్పెన సినిమా ఆ లోటు తీరుస్తుందని తెలుస్తోంది.
ఆ సినిమాలో కూడా శివయ్య మీద ఓ మాంచి పవర్ ఫుల్ తత్వగీతం ఒకటి వుందట. చంద్రబోస్ రాసిన ఈ పాట సినిమాలో మాంటేజ్ సాంగ్ గా వస్తుంది. దేవీశ్రీ ప్రసాద్ దీనికి మాంచి ట్యూన్ కట్టారట. సినిమా విడుదల (12) లోపు ఈ పాటను విడుదల చేసే అవకాశం వుంది.
ఇప్పటకే ఉప్పెన నుంచి మూడు పాటలు విడుదలై మాంచి హిట్ అయ్యాయి. ఇంకా బిట్ సాంగ్ లు అయితేనే, మాంటేజ్ లు అయితేనే నాలుగు పాటలు వున్నాయట.
సుకుమార్ అంటే చాలు దేవీ ప్రాణం పెట్టేసి పాటలు చేస్తాడు. సుకుమార్ సమర్పణలో మైత్రీ మూవీస్ నిర్మించే ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకుడు.